4, జూన్ 2022, శనివారం

నిరుపహతి స్థలంబు

 సాహితీమిత్రులారా!

కృష్ణదేవరాయలు ఒక కృతిని రచింపమని అడిగితే పెద్దన ఈ పద్యం చెప్పాడని ప్రసిద్ధి చెందినది.


నిరుపహతి స్థలంబు రమణీప్రయదూతిక తెచ్చి యిచ్చు క

ప్పుర విడెమాత్మకింపయిన భోజన ముయ్యెల మంచ మొప్పు త

ప్పరయఁ రసజ్ఞు లూహఁ దెలియంగల లేఖక పాఠకోత్తముల్

దొరికినఁగాని యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే


అంటే కృతి రాయాలంటే సరైన స్థలం దానితో పాటు రమణీయమైన ప్రియదూతిక తెచ్చి ఇచ్చే కర్పూర తాంబూలము, ఆత్మకు ఇంపైన భోజనము, ఉయ్యెల మంచము, ఇది ఒప్పు ఇది తప్పు అని తెలియగల రసజ్ఞులు, చెప్పినదాన్ని తెలుసుకొని రాయగల లేఖకులు, ఉత్తమమైన పాఠక మహాశయులు కావాలి. ఇవేవీ లేకుండా కృతి రాయడం ఎలా - అని భావం.

కామెంట్‌లు లేవు: