5, జూన్ 2022, ఆదివారం

భగవద్గీత

 


🌹భగవద్గీత🌹


పదునైదవ అధ్యాయము

పురుషోత్తమ యోno

9 వ శ్లోకము


శ్రోత్రం చక్షుః స్పర్శనం చ 

రసనం ఘ్రాణమేవ చ ౹

అధిష్ఠాయ మనశ్చాయం

విషయానుపసేవతే ౹౹ (9)


శ్రోత్రమ్ , చక్షుః , స్పర్శనమ్ , 

చ , రసనమ్ , ఘ్రాణమ్ , ఏవ , చ ౹

అధిష్ఠాయ , మనః , చ , అయమ్ ,

విషయాన్ , ఉపసేవతే ౹౹(9)


అయమ్ = ఈ జీవాత్మ

శ్రోత్రమ్ = చెవిని

చక్షుః = కంటిని

చ = మఱియు

స్పర్శనమ్ = చర్మమును

చ = అట్లే 

రసనమ్ = నాలుకను

ఘ్రాణమ్ = నాసికను

చ = మఱియు

మనః = మనస్సును

అధిష్ఠాయ = అధిష్ఠించి

ఏవ = వీటిద్వారా

విషయాన్ =శబ్దాది విషయములను

ఉపసేవతే = అనుభవించును


తాత్పర్యము:- ఈ జీవాత్మ త్వక్చక్షు శ్శ్రోత్ర జిహ్వా ఘ్రాణములనెడి పంచేద్రియములను , మనస్సును

ఆశ్రయించి , శబ్దాది విషయములను అనుభవించును. (9)

   

       ఆత్మీయులందరికి శుభ శుభోదయం

                Yours Welwisher

Yennapusa Bhagya Lakshmi Reddy

Advocate AP High Court Amaravathi

కామెంట్‌లు లేవు: