7, ఆగస్టు 2022, ఆదివారం

స్నేహనికో ఉత్తరం.

 స్నేహనికో ఉత్తరం.


మిత్రమా!.


ఉత్తరం రాయాలనిపించింది.

క్షేమ సమచారాలు అడగాలనిపించి 

వ్రాస్తున్న తొలి లేఖ.


సుదూర తీరాలలో ఉన్నావు.

చెంతలేక పోయిన 

చెలిమై యున్నావు.


కంటికి కానరాక 

కలత చెందుతున్నాను.

నా మనో ఫలకం అదురుతుంది.

మనసు విల విలలాడుతుంది.

నీ పలకరింపు కోసం 

పరితపిస్తుంది.


మరచి పోలేదని

మరువజాలనని

మన స్నేహం సాక్షిగా

మాట కోసం

మన కోసం

మరో మారు

కలుద్దాం.


ప్రపంచంలో అన్ని బంధాలు

ఏదో ఒక లాభం కోసమే.

కాని ఏ లాభం ఆశించని

నన్ను నిన్ను కలిపిన మైత్రి.


ఆలోచన స్వాగతించాము.

అనుభవాలు ఆస్వాదించాము.

కలిమి ఉన్నప్పుడు

లేమి సమయంలో

కలసి నడిచాము.


అంతలో కొన్ని బంధాలు

మనలను దూరం జరిపాయి.

ఆకలి నింపేందుకు 

కడుపు పట్టుకుని 

సూదూరం అయ్యాము.


రోజులు తరలిపోతున్నాయి.

కమ్మని స్నేహం వదలి

కరచాలనంకు దూరంగా

బ్రతుకు సాగిస్తున్నాము.


అప్పుడప్పుడు మనం

చేసిన చిలిపి పనులు

గుర్తుకొచ్చి స్నేహం 

ముసిముసిగా నవ్వుతుంది.


ఆలాపన రాగానే 

మన మైత్రి జ్ఞాపకాలు 

నెమరు వేసుకుంటున్నా.


ఆటలపాటలలో మన జోడు

ఎప్పటికి చిరస్మరణమే.


నేను గెలవాలని నీ ఆత్రం

నీ ఓటమి చూడగూడదు 

అని నేను 

ఒకరికొకరు పడిన తపన

ఎప్పటికీ మాయని ముద్రే.


జీవన తరంగాల్లో 

ఎగిరిన స్నేహమా 

తెగిన గాలి పటమా

ఏ చెట్టున తగిలావో

ఏ చోటన ఉన్నావో.


గుర్తు లేని చోట

గుర్తు లేకుండా

దాగి ఉన్నావా.


నా హృదయ దుర్పిణితో

అనంత దూరాలను  

మనసుతో శోధిస్తా... 

నిను చేరుకుంటా!.


వడలిన స్నేహం

ఆదరువుతో నిలిచేలా

నీ దరి చేరేలా

నా మనసుకు 

స్వాంతన కలిగేలా.


ఊసులాడుకుందాం.

మన ప్రపంచంలో విహరిద్దాం.

అప్పటి వరకు 

నేనొక అన్వేషిని.


స్నేహం కోసం నడిచే

యాత్రికుడిని.

నేనొక స్నేహ పిపాసిని.

నీవొక సుదూర నివాసివి.


కలిసే సమయం 

ఉన్నది తొందరలో...

అప్పటి వరకు 

ఎదురుచూపులే.


నీ మిత్రుడు.


అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

9391456575.

కామెంట్‌లు లేవు: