ఆఫీస్ పని మీద పొద్దున్నే హైద్రాబాద్ వచ్చాను.ఒక రోజులొనే పని అయిపోతే, సాయంత్రమే బయలు దేరి వెళ్లి పోవచ్చు అనుకున్నాను. కానీ ఒక రోజులో అయ్యేలాగా లేదు మరి. ఏదైనా Lodge లో రూమ్ బుక్ చెయ్య మని చెప్పాను మా ఆఫీస్ వాళ్ళకి.వాళ్లు అదే పనిలో ఉన్నారు.
ఈ లోగా నా బాల్య మిత్రుడు మూర్తి కి ఫోన్ చేసాను. వాడు చాలా సంతోషించాడు. కుశల ప్రశ్నలు అయ్యాక అడిగాడు నేను ఎక్కడ stay చేస్తున్నాను అని. నేను చెప్పాను మా వాళ్లు రూమ్ బుక్ చేస్తున్నారు అని.
మా వాడికి కోపం వచ్చింది, వాళ్ళ ఇంటికి రాకుండా ,ఎక్కడో ఓ lodge రూమ్ లో ఉండ వలసిన అవసరం ఏమిటి అని నన్ను తిట్టి, వాళ్ళ ఇంటికే రమ్మన్నాడు. నేను సరే అని వాళ్ల ఇంటికే బయలు దేరాను, మా ఆఫీస్ వాళ్లకు రూమ్ బుక్ చేయ వద్దు అని చెప్పి.
నేను వాళ్ల ఇంటికి ఒక అరగంటలో చేరుకున్నాను.
అప్పటికి మా మూర్తి ఇంటికి రాలేదు. వాడి శ్రీమతి నన్ను అన్నయ్య గారు అని పిలుస్తుంది ఎంతో ఆప్యాయంగా. చల్లటి మంచి నీళ్లు, వేడి coffe ఇచ్చింది. కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటే తెలిసింది, వాళ్ల అత్త గారు, అంటే, మా మూర్తి గాడి అమ్మగారు ఇక్కడే ఉంటున్నారు అని. నాకు చాలా సంతోషం అనిపించింది, వెంటనే ఆవిడ ఉండే రూమ్ లో కి వెళ్లి, ఆవిడకు నమస్కారం చేసాను. నేను ఆవిడ పడుకున్న మంచానికి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చుని ,ఆవిడతో మాట్లాడుతో ఉన్నాను. ఈ లోగా మూర్తి కూడా వచ్చాడు ,వాడు కూడా ఆ గది లోకే వచ్చాడు సరాసరి.
వాడు నాతో మాట్లాడక ముందే, వాడి జేబు లోనుంచి మొబైల్ తీసి ,వాళ్ల అమ్మ చేతిలో పెట్టాడు. మేము ఇద్దరం మాట్లాడు కుంటున్నాము, coffe తాగుతూ,
నేను రెండో సారి. ఇంతలో మూర్తి గాడి అబ్బాయి వచ్చాడు , ఆ అబ్బాయి ఎంటెక్ చేస్తున్నాడు,jntu లో.
అతను కూడా, మొబైల్ హాండ్సెట్ తీసి మామ్మ చేతిలో పెట్టాడు. ఇంకో అయిదు నిముషాలు ఆయాక మూర్తి గాడి అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తున్నది ట, ఆ అమ్మాయి కూడ వాలెట్ లోనుంచి మొబైల్ తీసి పెద్దావిడ చేతిలో పెట్టి, నన్ను పలకరించి వెళ్లి పోయింది.
నేను ఆశ్చర్య పోయి అడిగాను మూర్తిని, అందరూ మొబైల్స్ ఆ పెద్దవిడకి ఎందుకు ఇచ్చేస్తున్నారు అని.
అప్పుడు మెల్లగా నవ్వి చెప్పాడు మూర్తి 'ఒరే, ఇంటికి వచ్చాక కూడా అందరూ మొబైల్స్ పట్టుకుని, వాట్సాప్ లు, ఫేస్ బుక్లు చూసుకుంటూ ఉంటే, ఇది ఇల్లులా ఉండటంలేదు,ఒకళ్ళ సంగతలు వీరోకళ్లకు తెలియటం లేదు, అసలే బయట జీవితం యాంత్రికంగా ఉంటోంది,ఇంట్లో కూడా అలా ఉండ కూడదు అని, మా శ్రీమతి ఈ నిర్ణయం తీసుకుంది " అని ఏకధాటిగా చెప్పి వాళ్ళ ఆవిడను మెచ్చుకోలుగా చూసాడు.
"అవును అన్నయ్య గారు, పిల్లలు,ఆయన ఎపుడు వస్తారా,వాళ్ళతో కబుర్లు చెపుదాము అని నేను ఆశగా ఎదురు చూస్తూ వుంటే, వాళ్ళు మాత్రం మొబైల్స్ తో నే కాలం గడిపేస్తున్నారు, ఇంటికి వచ్చినా, అందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను, దానికి మా అత్త గారు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. మొదట్లో moblies నా దగ్గరే పెట్టు కునే దాన్ని, కానీ వాళ్ళు న మాట వినే వారు కాదు,ముఖ్యంగా మా ఆయన, అందుకే ఇప్పుడు ఆ డ్యూటీ పెద్దవిడకి ఇచ్చాను,ఆవిడ అంటే అందరికి గౌరవం , అందుకే అందరూ కట్టుబడి ఉంటారు, ఈ నిబంధనకి " అని ముగించారు Mrs murthy.
నేను కూడా మా ఆవిడతో క్లుప్తంగా మాట్లాడి, నా మొబైల్ కూడా ఆ పెద్దవిడకు ఇచ్చేసా.
కానీ అప్పుడు ఓ సందేహం వెలుబుచ్చాను, ఎవరైనా బయట వాళ్లు ,వీళ్ళతో మాట్లాడాలి అంటే ఎలా అని.
Mrs murthy చెప్పారు, ,అన్నయ్య గారు, నా ఫోన్ నెంబర్ అందరికి తెలుసు, urgent అయితే నాకు వాళ్లు ఫోన్ చేస్తారు, పైగా నా ఫొన్ స్మార్ట్ ఫొన్ కాదు, ఒక బేసిక్ ఫోన్ మాత్రమే, నా ఫోన్ కి ఈ నియమం వర్తించదు' అని వివరణ ఇచ్చారు
రాత్రి dinner చేస్తున్నప్పుడు, అందరూ చక్కగా మాట్లాడు కుంటూ, ఒకరి సంగతులు మరొకరు తెలుసు కుంటూ, వంటకాలను ఆస్వాదిస్తూ కడుపు నిండా తిన్నారు. ఓ మంచి idea వాళ్ళ ఇల్లుని బొమ్మరిల్లుగా మార్చేసింది.
నేను మా ఇంట్లో mobile surrender @ night
అనే నిబంధన అమలు పరచాలి అని నిర్ణయించుకుని,
వాళ్ళ అందరి లాగే ఓ మంచి తెలుగు పుస్తకం చదువుతూ నిద్రలోకి జారుకున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి