14, నవంబర్ 2022, సోమవారం

వైశంపాయన మహర్షి

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*మన మహర్షుల చరిత్రలు..*


*🌹ఈరోజు 71వ వైశంపాయన మహర్షి గురించి తెలుసుకుందాము...🌹*


☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁


☘️ఈయన చాలా గొప్ప ఋషి. మహాభారతంలో ఈ ఋషి పేరు ఎక్కువ విని వుంటాం. వేదాల్ని అన్ని వైపులా వ్యాప్తి చేయడానికి కృషి చేసింది ఈ వైశంపాయన మహర్షి. వైశంపాయన మహర్షి ఒక ముని కొడుకు. చిన్నప్పుడే వ్యాస మహర్షికి అప్పగించాడు తండ్రి.


🍁వ్యాసుడు ఈ పిల్లవాడికి విద్యాబుద్ధులు చెప్పి కొంచెం పెద్దవాడయ్యాక యజుర్వేదం నేర్పి ఈ వేదాన్ని అన్ని లోకాల్లోనూ వ్యాపించేలా చెయ్యమన్నాడు. వైశంపాయనుడు యజుర్వేదాన్ని ఇరవై ఏడు శాఖలుగా విభజించి తన శిష్యులో అన్ని లోకాల్లోనూ వ్యాపించేలా చేశాడు.


☘️వైశంపాయనుడి ఆశ్రమంలో ఎంతోమంది శిష్యులు వేదం నేర్చుకుంటూ వుండేవాళ్ళు. యాజ్ఞవల్క్యుడనే శిష్యుడు నాలుగు వేదాలు నేర్చుకుని గురుభక్తి కలిగి ప్రియశిష్యుడుగా ఉండేవాడు.


🍁కాని రానురాను యాజ్ఞవల్క్యుడికి గర్వం ఎక్కువయిపోయింది. అహంకారం ఉండకూడదని గురువుగారు ఎంత చెప్పినా వినకపోవడంతో తాను నేర్పిన వేదం తన దగ్గరే కక్కేసి వెళ్ళమని చెప్పి బయటకి పంపేశాడు యాజ్ఞవల్క్యుడుని వైశంపాయనుడు. 


☘️తనకి అత్యంత ప్రియమైనవాడు, గురుభక్తి వున్నవాడు అయినా సరే! అహంకారి కాబట్టి శిష్యుణ్ణి శిక్షించాడు వైశంపాయనుడు. పూర్వం కృష్ణద్వైపాయనుడనే బ్రహ్మర్షి వేదాల్ని భాగాలుగా చేసి శిష్యులతో అన్ని లోకాల్లోనూ వ్యాపించేలా చేశాడు.


🍁వేదవ్యాసుడు తన విజ్ఞానంతో మహాభారతాన్ని రచించి విశ్వానికి ఉపయోగించేలా చేశాడు. కృష్ణద్వైపాయనుడు మహాభారతాన్ని భూలోకంలో జనమేజయుడికి చెప్పడానికి వైశంపాయన మహర్షిని పంపాడు.


☘️జనమేజయుడికి పురాణ పుణ్యకథలు వినడమంటే చాలా ఇష్టం. ఒకసారి వ్యాసుడు శిష్యులతో జనమేజయుడి దగ్గరికి వెళ్ళాడు. వ్యాసుడికి ఎదురెళ్ళి అర్ఘ్య పాద్యాలిచ్చి పూజించి జనమేజయుడు కౌరవ పాండవుల గురించి చెప్పమని అడిగాడు.


🍁వ్యాసుడు మహాభారతమంతా వైశంపాయనుడు నీకు చెప్తాడని చెప్పి వైశాంపాయనుణ్ణి జనమేజయుడికి అప్పగించి వెళ్ళాడు.


☘️వైశంపాయనుడు గురువుగారికి మనస్సులో నమస్కారం చేసి వినేవారికి కోరిన కోరికలిచ్చేది, జన్మజన్మల పాపాన్ని పోగొట్టేది, ధర్మార్థ కామమోక్షాలకి గొప్ప సాధనమైంది, సత్యవాక్యాలతో వంద వేల శ్లోకాలతో వున్నది, వ్యాసమహామునితో వ్రాయబడింది అయిన భారతాన్ని జనమేజయుడికి వివరంగా చెప్పాడు .


🍁జనమేజయుడు మళ్ళీ సందేహాలు అడిగాడు. యుద్ధం తర్వాత పాండవులు కౌరవులు స్వర్గానికి వెళ్ళి ఎక్కడ వున్నారు? అని వైశంపాయనుడు రాజా! కొంచెం పుణ్యం చేసుకున్న వాళ్ళు ముందు స్వర్గానికి వెడతారు.


☘️తర్వాత నరకానికి వెడతారు. దుర్యోధనుడు వీరస్వర్గం పొందాడు. కాబట్టి, ముందు స్వర్గానికి వెళ్ళి తర్వాత కలిలో కలిసిపోయాడు. అతని తమ్ముళ్ళు రాక్షసులయ్యారు అని చెప్పాడు. ఎవరెవరు ఎక్కడెక్కడికి చేరారో చెప్తాను విను.


🍁అర్జునుడు నారాయణుడి ప్రక్కన చేరాడు, కర్ణుడు ద్వాదశాదిత్యుల ప్రక్కన, భీముడు మరుద్గణాల్లో, నకుల సహదేవులు అశ్వినీ దేవతల్లోనూ ఉన్నారు అని చెప్పాడు వైశంపాయనుడు.


☘️ధృతరాష్ట్రుడు కుబేర లోకంలోనూ, పాండురాజు ఇంద్ర భవనంలో, అభిమన్యుడు చంద్రుడిలో, ద్రోణుడు బృహస్పతిలో, భీష్ముడు వసువులో, ధర్మరాజు, విదురులు ధర్మదేవతలో ఇలా ఇంకా ఎవరెక్కడెక్కడ ఉండిపోయారో వివరంగా చెప్పాడు వైశంపాయనుడు.


🍁తర్వాత వైశంపాయనుడు జనమేజయుడికి హరివంశ కథలన్నీ చెప్పాడు. ఆ కథల పేర్లు కొన్ని ఇక్కడ చూద్దాము. కథలు అన్నీ  చెప్పాలంటే కష్టం. పృథు చక్రవర్తి చరిత్ర, మన్వంతర వివరణ, కువలయాశ్వ చరిత్ర, త్రిశంకు చరిత్ర, జాంబవతీ చరిత్ర, దత్తుని చరిత్ర, యయాతి చరిత్ర, ఇలా చాలాచాలా కథలున్నాయి.


☘️ఇవన్నీ వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. చివరగా జనమేజయుడు వైశంపాయనుణ్ణి అడిగి మోక్ష మార్గం గురించి కూడా తెలుసుకున్నాడు.


🍁వైశంపాయనుడు రాసిన 'నీతిప్రకాశిక' అనే గ్రంథంలో యుద్ధ నీతి గురించి తెలియచెయ్యబడింది. దాంట్లో సేనా నాయకుడి విధులు, సైనిక విన్యాసం, ప్రాచీక భారతదేశ శస్త్రాస్త్రాల గురించి, సుమారు నూట ముప్పై ఆరు రకాల ఆయుధాల గురించి రాశాడు.


☘️యుద్ధం వివరంగా ఎలా చెయ్యాలి సైన్య సమీకరణ మొదలు ఎనిమిది సర్గలున్నాయి దీంట్లో. బహుశా వైశంపాయన మహర్షికి ఇది తెలియదు అన్నది లేదేమో.. ఇంతటి మేధావిని గురించి తెలుసుకున్న మనం ఎంతో ధన్యులం....💐🙏


🍁ఇదండి మనము తెలుకున్న వైశంపాయన మహర్షి గురించి విశేషాలు రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము..స్వస్తి!


కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 


☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁

కామెంట్‌లు లేవు: