శ్లోకం:☝️
*గౌరం కుంకుమపంకిలం సుతిలకం*
*వ్యాపాండుగండస్థలం*
*భ్రూవిక్షేప కటాక్షవీక్షణ-*
*లసత్ సంసక్త కర్ణోత్పలం l*
*స్నిగ్ధం బింబఫలాధరప్రహసితం*
*నీలాలకాలం కృతం*
*వందే పూర్ణశశాంకమండల-*
*నిభం వక్త్రం హరస్యోత్తరం ll*
- వామదేవ ముఖధ్యానం
భావం: గౌర (ఎరుపుతో కలిసిన తెలుపు) వర్ణం కలదీ, కుంకుమపూవు పూతతో దిద్దినదీ, అందమైన తిలకం కలదీ, విశేషంగా తెల్లదనంగల చెక్కిళ్లు కలదీ, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుతో ప్రకాశించడంతో పాటు చెవికి అలంకారంగా ఉన్న తెల్లకలువపూవు కలది, నున్నని దొండపండును పోలు ఎర్రని కింద పెదవిపై స్పష్టమైన నవ్వు కలది, నల్లని మున్గుతులచే అలంకరించిన, నిండుచంద్రుని మండలాన్ని పోలుతూ ప్రకాశించేదీయైన శివుని ఉత్తరాముఖమును స్తుతిస్తున్నాను.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి