*👌👌👌👌 నేను ద్రాక్ష పండ్లను కొంటానికి మార్కెట్లోకి వెళ్ళాను.*
నేను : బాబు కిలో ఎంత...?
అతను : *"కిలో 80 సర్।"*
పక్కనే విడి విడిగా ఉన్న ద్రాక్ష పండ్లను చూసాను.... ।
నేను అడిగాను : *" మరి వీటి ఖరీదెంత?"*
పండ్లతను : *"30 రూపాయలకు కిలో సర్"*
*నేను అడిగా : "ఇంత తక్కువనా..?*
*పండ్లతను : "సర్,* *అవి కూడా మంచివే..!!*
*కాని...*కాని అవి గుత్తి నుండి విడి పోయాయి ...అందుకే అంత తక్కువ రేటు।"*
*అప్పుడు నాకు అర్థమైంది...* *సమాజము,సంఘము మరియు* *కుటుంబము* *నుండి వీడి పోతే .....మన జీవితము కూడా సగానికన్న తక్కువకు పడిపోతుంది।*
*దయ చేసి మీ *కుటుంబము లో ఉండండి.....*
*ఈ జన్మకే....*
*ఈ జన్మకే వాళ్ళు మన అమ్మా నాన్నలు...*
*ఈ జన్మకే వాళ్ళు మన కొడుకూ కూతుళ్ళు...*
*ఈ జన్మకే వాళ్ళు మన జీవిత భాగస్వాములు...*ఈ జన్మకే వారు మన అత్త మామలు
*ఈ జన్మకే వాళ్ళు మన అక్కా చెల్లెల్లు,* *అన్నా తమ్ముళ్ళు...*
*ఈ జన్మకే వాళ్ళు మన స్నేహితులు,* *సన్నిహితులు...*
*ఈ జన్మకే, కేవలం ఈ జన్మకే!*
*మహా అయితే ఇంకో పదీ..పదిహేను, ఇరవై ..........సంవత్సరాలు !*
*కుటుంబము లో ఎవరు తప్పు చేసినా క్షమిద్దాం ,అనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం!*
*పోయాక ఫోటోను ప్రేమించే కన్నా,*
*ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న*
*బంధుత్వాలు* *తెంచుకోవడం నిముషం.*
*అదే నిలుపుకోవాలంటే ?*
*తము గడిపిన భయంకర అవస్థలు తమ*
*పిల్లలకు రాకూడదని* *తమ పిల్లలు కూడా నలుగురిలో* *ఉన్నతంగా బ్రతకాలనే తాపత్రయంతో*
*కన్నవాళ్ళు తను సామాన్య జీవితాన్ని గడుపుతూ*
*ఆస్థులు కూడ బెట్టి తమ పిల్లలకు ఇస్తే ,*
*తమ తల్లిదండ్రులు బతికి ఉండగానే కొందరు*
*తమ తల్లిదండ్రులు కాలం చేసాక కొందరు*
*వివిధ రకాల కారణాలతో రక్త సంబంధీకులందరూ శాశ్వతంగా* *దూరమవుతూ ,*
*బ్రతికి ఉండగా మాట్లాడు కోకుండా,* *మొహాలు కూడా*
*చూసుకోకుండా తమ జీవితాంతం వరకు ఒకరి నొకరు*
*ద్వేషించుకుంటూ , ఆ ద్వేషాలు తమ వారసత్వంగా తమ పిల్లలకు కూడా బదిలి చేస్తూ , తన* *అశాంతితో*
*జీవిస్తూ తన వారిని కూడా అశాంతి పాలు చేస్తున్నారు*.
*ఎవరి కోసం ? ఎందు కోసం ?*
*దాని వల్ల ఒరిగే ప్రయోజనము ఏమిటి ?*
*జీవితాంతం ఒక రక్తం పంచుకున్న అన్న దమ్ములు ,*
*అక్క చెల్లెళ్ళు . అన్నా చెల్లెళ్ళు* *పరస్పరం*
*అశాంతితో* *ద్వేషించుకుంటూ ఒకరి నొకరు* *చూడకుండా*
*జీవిస్తూ శాశ్వతంగా* *దూరమయి , ఇంటి* *లోని ఆనందాన్ని* *పంచుకోకుండా,* *వివాహాలకు*
*కూడా* *పిల్చుకోకుండా ,* *హాజరుకాకుండా ,*
*చివరకు ఎవరో ఒకరు కాలం చేసాక తట్టుకోలేని*
*శోకతప్తులై గుండెలు బాదుకుని కుమిలి కుమిలి*
*విలపిస్తే ఆ చనిపోయిన వారిని తిరిగి పొందగలమా?*
*ఆ ఖాళీ అయిన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.*
*కొంతమంది తమ తల్లిదండ్రులను కూడా ఈ ఆస్థిపంపకాల* *అసంతృప్తితో దూరం చేసుకుంటున్నారు.*
*ఆ వయసులో * కన్నవారు పడే వేదన వర్ణనాతీతం.*
*మరి ఈ సమస్య కు పరిష్కారము ?*
*పంతాలు* *పౌరుషాలు ప్రక్కన పెట్టి అందరూ*
*కూర్చుని* *సామరస్యంగా* *ఆవేశాలకు పోకుండా*
*మాట్లాడుకుని* *పరిష్కరించుకుంటే అభిమానాలు*
*కలకాలం పరిమళిస్తూ అనుబంధాలు పెంపొందే*
*అవకాశం ఉంటుందేమో నని నా నమ్మకం*.
*దీనికి కావల్సింది సహనంగా ఆలోచించడం*
*విచక్షణ తో పట్టుదలలు సడలించు కోవడం*
*ఈ విషయములో పెద్దవారు చొరవ తీసుకోవాలి ..*.
*ఓడిన వాడు కోర్టులోనే ఏడుస్తాడు*
*గెలిచిన వాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు*
*రెండిటికీ తేడా ఏమీ ఉండదు.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻*
*ఈ జ్ఞాపకాలు ఈ ఒక్క జన్మకే*
👏👏👏👏👏👏👏👏👏
(సేకరణ)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి