పోతన సూక్తి సుధ
కలుగరే రాజన్యు లిలను నేలగ లేదె
ఘనతతో తిరుగరే గర్వమునను !
వారేరి ! యిప్పుడీ వసుధలో నున్నారె !
సిరి తోడ దివముకు చేరి నారె!
నుర్వి పై వారల కున్నట్టి పేరది
నిలిచినే యశముతో నిఖిలమందు
శిబిచక్రవర్త్యాది శ్రేష్టులౌ రాజులు
కోర్కెలన్ దీర్చరే కూర్మి జనుల
వారలను విస్మరించిరె వసుధ యందు !
ఎన్ని వర్షంబు లేలిన న్నేమి ఫలము
యిహ పరమ్ములు లేకను నహము తోడ
బ్రతుకు నందున యశమును బడయకునికి.
: ఆంధ్రమహాభాగవతావతరణము
ఘనత గాంచిన బమ్మెరగ్రామ మందు
గురుతి కెక్కిన కౌండిన్యగోత్ర మందు
సహజకవి పోతనార్యుండు జనన మందె
భక్తవర్యుల పుణ్యంపు భాగ్యమునను 01
ఘనుడు 'భీమనమంత్రి' తనయుడౌ 'యన్నయ్య'
సజ్జనవినుతుండు సాత్వికుండు
'గౌరమ్మ' యర్థాంగి కడు పతివ్రత భువిన్
'సోమన్న' వారల సుప్రజుండు
సోమన్న మల్లమ్మ సుతునిగా 'యెల్లన్న'
ప్రభవించె నందరు ప్రస్తుతించ
మాన్యు 'డెల్లన'కును 'మాచమ్మ' యందున
'కేసన' బుట్టెను వాసి గాను
ప్రీతితో 'లక్కమాంబ'ను పెండ్లి యాడ
కేసనకు పుత్రు లిర్వురు పుట్టి రరయ
ప్రథమ పుత్రుండు 'తిప్పన' పండితుండు
పుట్టె 'పోతన' రెండవ పుత్రునిగను 02
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి