*కొట్టెను భీమసేనుcడు సఖుల్ గన భానుమతీ సతిన్ సభన్*
ఈ సమస్యకు నాపూరణ.
(శకారుడు అనేవాడు రాజుగారి బావమరిది.క్రూరుడు మూర్ఖుడు. అసంబద్ధాలు మాట్లాడుతూ వుంటాడు. సమస్యను శకారుని వాచాలతగా పూరించితిని.)
కొట్టిన పిండి నా కెపుడు కొత్తవి సంగతు లెన్నొ విప్పగన్
మట్టిని దవ్వి తీసితిని మాధవు వేణువు నిచ్చి వేసితిన్
కొట్టెను భీమసేనుcడు సఖుల్ గన భానుమతీ సతిన్ సభన్
ముట్టడి మౌని చేసె నొక ముచ్చట చెప్పుదు నే శకారుడన్.
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి