3, జనవరి 2025, శుక్రవారం

11-41,42-గీతా మకరందము

 11-41,42-గీతా మకరందము

          విశ్వరూపసందర్శనయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


సఖేతి మత్వా ప్రసభం యదుక్తం 

హే కృష్ణ హే యాదవ హే సఖేతి | 

అజానతా మహిమానం తవేదం 

మయా ప్రమాదాత్ప్రణయేన వాపి ||  


యచ్చాపహాసా ర్థమసత్కృతోఽసి 

విహారశయ్యాసనభోజనేషు | 

ఏకోఽథవాప్యచ్యుత తత్సమక్షం 

తత్ క్షామయే  త్వామహమప్రమేయమ్ || 

   

తా:- నాశరహితులగు ఓ కృష్ణా! మీయొక్క ఈ మహిమను తెలియక పొరపాటునగాని, చనువువలనగాని, సఖుడవని తలంచి ‘ఓ కృష్ణా, ఓ యాదవా, ఓ సఖా’ అని అలక్ష్యముగ మిమ్ముగూర్చి నేనేదిచెప్పితినో మఱియు విహారముసల్పునపుడుగాని, పరుండునపుడుగాని, కూర్చుండునపుడుగని, భుజించునపుడుగాని, ఒక్కరుగ నున్నపుడుగాని, లేక ఇతరులయెదుటగాని పరిహాసముకొఱకు ఏ అవమానమును గావించితినో - ఆ యపరాధము లన్నిటిని అప్రమేయులగు మీరు క్షమింపవేడుచున్నాను. 

   

వ్యాఖ్య:- చేసిన తప్పిదమునకు పశ్చాత్తాపపడి మఱల నద్దానిని చేయకుండుట విజ్ఞుల లక్షణము.

కామెంట్‌లు లేవు: