సీ॥
మారవచ్చునుగాక! మాటికి ధర్మమ్ము
యుగము మారిన వేళ సగము తగ్గి
మారవచ్చునుగాక! మనుజుల మస్తిష్క
మార్గమ్ము కించిత్తు మలినబడుచు
మారవచ్చునుగాక! మనసుల మమతలు
దుర్మార్గపూరమై త్రోవదప్పి
మారవచ్చునుగాక! మారని మనసులు
పెడమార్గమునుబట్టు విధము తొలగి
తే౹గీ॥ మారబోవదు ధర్మమ్ము మనుజురీతి
ధర్మలక్షణము స్థిరమై తనరుచుండు
నెల్లవేళల వేసంగి మల్లెవోలె
సర్వజనులకు హితముగా సాగుచుండు.
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి