*కంగారు పడకండి. ఎవరూ ఎవరినీ తిట్టడం లేదు.*😊
*నిజం చెప్పాలంటే అసలు ఇది తిట్టే కాదు. అర్థం తెలిసిన వారు సందర్భానుసారంగా వాడతారు, తెలీని వారు తిట్టు అనుకుని ప్రతి సందర్భంలోనూ వాడేస్తూ ఉంటారు.*
*దీని కథా కమామీషు ఒకసారి పరిశీలిద్దాం.*
*"ప్రాచ్య" అంటే తూర్పు. తూర్పుకి అవతలి వైపు "పడమర" లేదా "పశ్చిమం." ప్రాచ్య కానిది అప్రాచ్య. అలాగే, పశ్చిమం "ప్రాశ్చాత్యం" అయింది.*
*నాగరికత, సంస్కృతి సంప్రదాయాలు గల మనదేశం తూర్పున ఉన్న భారత దేశం. ఇవేమీ లేనివారు లేదా తెలియని వారు పాశ్చాత్యులు లేదా అప్రాచ్యులు.*
*పూర్వం పెద్దలు, సంస్కృతి సంప్రదాయాలు పాటించని వారిని కసితీరా "అప్రాచ్యుడా" అని కసురుకునేవారు. కసి ఎందుకంటే, ఆ పాశ్చాత్యులే కదా మన దేశాన్ని ఆక్రమించి, దండయాత్రలు చేసి, నాగరికతను ధ్వంసం చేసింది. వారి మీద ఉన్న కసి ఆ నాగరికత తెలియని వారిపై ఇలా ప్రయోగిస్తూ ఉండేవారు.*
*"వడ్లగింజలో బియ్యపు గింజ" వైనం. కనుక, ఎవరైనా "అప్రాచ్యుడా" అని తిడితే, వారికి అర్ధం తెలియదని సర్దుకుపోండి. మన సంస్కృతి సంప్రదాయాలు పాటించినంత కాలం మనల్ని మనం కాపాడుకున్నట్టే.*😊
*"శుభ సాయంత్రం*"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి