శుభోదయమ్. సుభాషితమ్
> శ్లో॥
> విద్యాధనమదోన్మత్తో యః కుర్యాత్పితృహేలనమ్।
> స యాతి నరకం ఘోరమ్ సర్వధర్మబహిష్కృతః॥
ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ
అనువాదపద్యం:
తే.గీ.
ౘదువుల మధించి గర్వించి సన్నుతులయి
తండ్రి గురువుల ప్రేమతోఁ దలఁపఁబోక
చులకనంజేసి మసలేటి శూన్యమతులు
ధర్మహీనులై నరకానఁ దనరుచుండ్రు
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి