//సుభాషితం//
అసంతుష్టా ద్విజా నష్టాః
సంతుష్టాశ్చ మహీభృతఃl
సలజ్జా గణికా నష్టా
నిర్లజ్జా చ కులాంగనాll
असंतुष्टा द्विजा नष्टाः संतुष्टाश्च महीभृतः ।
सलज्जा गणिका नष्टा निर्लज्जाश्च कुलाङ्गना ॥
//ఆ.వె//
తుష్టి లేని ద్విజుడు హృష్టుడయిన రేడు
అమిత లౙ్జనూను ఆటవెలదిl
ఈల వీడి తిరుగు ఈలువటాండ్రును
నష్టపోదురిలను నారసింహll
-మల్లిభాగవతః...!
[ద్విజుడు=బ్రాహ్మణుడు
రేడు=రాజు
ఆటవెలది=వేశ్య
ఈల=సిగ్గు
ఈలువటాండ్రు=పతివ్రతలు ]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి