*పాప భారం*
🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭
మహా కుంభ మేళాలో త్రివేణీ సంగమ స్నానమాచరిస్తన్న కోట్లాది మందిని చూసిన ఒక ఋషిపుంగవునికి ఒకసందేహంవచ్చి వెంటనే గంగాదేవిని
ప్రార్థించి ఇలా అడిగాడుట!
అమ్మా గంగాభవాని! ఎందరో ఎన్నెన్నో పాపాలు చేసి నదిలో మునక వేసి వారి వారి పాపాలన్నీ నీలో కలి పేస్తూన్నారు. మరిఇందరి ఇంత ఎక్కువ పాప భారాన్ని ఎలా మోస్తూన్నావు తల్లీ? అని.
అందుకాతల్లి. " నాయనా నేనెట్లా ఆ పాప భారం మోస్తున్నాను? అవన్నీ ఎప్పటికప్పుడు తీసుకెళ్లి సముద్రం లో
కల్పేస్తున్నాను" అని బదులిచ్చిందట.
ఆ మాట విన్న ఋషి అయ్యో! అన్ని పుణ్య నదులు ఇంతే కదా? పాపాలన్నీ అన్ని నదులూ సముద్రం లోనే కలిపేస్తున్నాయి కదా? పాపం! సముద్రుడు ఈ పాప భారాన్ని ఎలా భరిస్తునాడో అనుకుని సముద్రుడ్నే అడిగాడట ఎలా మోస్తున్నావు ఈ పాప భారాన్ని? అని
దానికి ఆ సముద్రుడు!
నేనెక్కడ మోస్తున్నాను ఆ పాపాలనూ!
వెనువెంటనే ఆవిరిగామార్చి పైకి మేఘాలలోకి పంపిస్తాను కదా
అని బదులు ఇచ్చాడట!
అరే! ఎంతో తేలిక గా కదలిపో యే మేఘమాలికలారా! మీరు ఎలా భరిస్తున్నారు ఆ పాప భారాన్ని? అని.అడగగా!!!!
అవి పక పకా నవ్వి! మేమెక్కడ భరిస్తున్నాం? ఆ పాపాలన్నీ ఎప్పటికప్పుడే వర్ష రూపేణా మీ మీదే కురిపించేస్తున్నాం అని బదులిచ్చాయట!
ఓహో!!! ఆ పాపాలన్నీ మనమీద పడి తరిగి మనమే అనుభవిస్తున్నాము అన్న మాట!
ఎట్టి పరిస్థితుల్లోనూ! ఎవరూ కూడా! కర్మ ఫలితాలను వదిలించుకోలేమని ఆ ఋషి గ్రహించాడు!!!
అప్పుడు ఆ ఋషికి పరమశివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన శ్లోకం గూర్తుకొచ్చింది!
*" ఇదం తీర్థ మిదం తీర్థం భ్రమన్తి తామసాః జనాః,*
*ఆత్మ తీర్థం నజానన్తి కథం మోక్షః శృణు ప్రియే. "*
అంటే
ఈ తీర్థం లో స్నానమాచరించిన పాపాలు నశించును, ఆ తీర్థం లో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఇంకో నదిలో స్నానమాచరించిన మోక్షం సిద్ధించును! అని తీర్థస్నానములకై పరుగులెత్తెడు మానవులు " భ్రమకు లోబడినవారు".
*" ఆత్మజ్ఞాన మనే తీర్థం లో స్నానమాచరించని వారికి మోక్షమెట్లు కలుగును?"*
*" కర్మ కర్మణా నశ్యతి కర్మ "*
కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది.
*పురోహితులు కళాధర శర్మ తెలకపల్లి 🪷💐*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి