శీర్షిక.. జీవితమే ఒక ఛాలెంజ్!
ఛాలెంజ్! ఛాలెంజ్! ఛాలెంజ్!
సవాలు విసురుతూ
ఇంటా బయటా ఛాలెంజ్
గెలుపూ-ఓటమి మధ్య ఊగిసలాడే
నీ బ్రతుకే ఒక ఛాలెంజ్!
జననం నుండి మరణం దాకా
నష్టాలను భరిస్తూ..కష్టాలకు ఎదురీదుతూ
సమస్యల సుడిగుండాల్లో తీరం వెదుకుతూ
గమ్యం చేరాలనే జీవన యానమిది..
నిత్యం అనునిత్యం
పడుతూ లేస్తూ, అడుగడుగులో
ఎన్నో ఆటంకాలెదురవుతూ
నీ సహనానికి పరీక్ష పెడుతూ ..
క్షణం క్షణం పరిష్కారాలను వెదుకుతున్న
కృషితో సాధిస్తావు విజయం
అనుభవాలే నేర్పుతాయి గుణపాఠం
దృఢ సంకల్పమే నీ ఆయుధం
నీ తోడవుతుంది ఆత్మవిశ్వాసం
స్వీయ కృషితోనె సాధిస్తావు విజయం
తిమిరంలో కూడా వెలిగిస్తావు ఆశాజ్యోతిని
మార్గదర్శిగా....
అందరిలో నీవొక్కడిగా
నీ అడుగుల్లో అడుగులు వేస్తూ
జనసంద్రమె నీ తోడవుతుంది
మెలమెల్లగా గమ్యం చేరే దాకా!
నీక సవాల్ విసురుతూ....
ఇది నా స్వీయ కవిత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి