4, ఏప్రిల్ 2025, శుక్రవారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*తల్లి బిడ్డను పోషించినట్లు భక్తి భక్తుణ్ణి కాపాడుతుందని ఈ శ్లోకములో శంకరులు వివరించారు.*


 *శ్లోకము : 62*


*ఆనందాశ్రుభి రాతనోతి పులకం నైర్మల్యత శ్ఛాదనం*

          

*వాచా  శంఖముఖ స్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః౹*

          

*రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా*

          

*పర్యంకే విని వేశ్య  భక్తి జననీ భక్తార్భకం  రక్షతి.!!*


*తాత్పర్యము :-*


*ಓ మహాదేవా !  తల్లి ప్రేమతో ఆనంద బాష్పములు జారుతుండగా బిడ్డను చేరదీసి, రోమాంచిత గాత్రుణ్ణి చేసే విధంగా, భక్తి రసము భక్తుడికి ఆనందబాష్పములు ఒలికించి, శరీరము పులకించి ఉప్పొంగేటట్లు చేస్తుంది.* 


*తల్లి బిడ్డకు ఈగలూ, దోమలూ, చలి మొదలైన వాటి బాధ లేకుండా, బట్ట కప్పిన విధంగా భక్తి నిర్మల భావాన్ని కప్పుతుంది.*


*తల్లి శంఖములో పోసి కడుపార బిడ్డకు పాలు పట్టించినట్లు,  "భక్తి" వేదాది వాక్యముగా  నీ చరిత్రామృతమును  తనివి తీరా ఆస్వాదింప చేస్తుంది.*


*రుద్రాక్షలు ధరింప జేసి, విభూతిని పెట్టించి అంగరక్ష కావించి, తల్లి బిడ్డను మంచముపై పడుకో పెట్టి కాపాడుతున్న విధంగా, భక్తి మనస్సు నందు ఈశ్వరధారణ అనే మంచములో ప్రవేశబెట్టి కాపాడుతుంది.*


*వివరణ :-*


*భక్తి తల్లి వంటిది. తల్లి  పిల్లల. యోగక్షేమాలను స్వప్న , జాగ్రదవస్థలలోనూ కోరు కుంటుంది.*


*ఈశ్వరా !  భక్తి అనేతల్లి, నీ భావన అనే  ఉయ్యాలలో, భక్తుడు అనే శిశువును, చక్కగా ఉంచి కంటికి రెప్పలా కాపాడుతుంది.* 


*తల్లి బిడ్డను చూసుకొని మురిసిపోతూ ఉంటుంది.  ఒక్కోసారి ఆ వాత్సల్య రసం ఆనంద బాష్పాల రూపంలో పైకి తన్నుకు వస్తుంది.  ఆ బిందువులు ఒకటో రెండో బిడ్డపై పడగానే  ఆబిడ్డ ఆనంద పారవశ్యముతో  గగుర్పాటు చెందుతుంది. అలాగే భక్తి  భక్తుణ్ణి రోమాంచితునిగా చేస్తుంది.*


*తల్లి పిల్లకు దృష్టి తగలకుండా, గాలి మొదలయినవి సోకకుండా తాయెత్తులు కడుతుంది.  మంత్రించిన. విభూతిని శరీరానికి రాస్తుంది.  భక్తి అనే  తల్లి కూడా రుద్రాక్షలతో , విభూతితో  భక్తుడనే పిల్ల వాడికి రక్షకడుతుంది. భక్తుడనే పిల్లవానిని ఈశ్వర భావన అనే  ఉయ్యాల తొట్టిలో పెట్టి నిద్ర పుచ్చుతుంది.* 


*ఎంతగా ఏడుస్తున్న  పిల్లవాడైనా తల్లి  ఎత్తుకోగానే ఏడుపు మానివేస్తాడు. బిడ్డకు తల్లి ఒడిలో ఏదో అనిర్వచనీయమైన ఆనందానుభూతి కల్గుతుంది. భక్తి కూడా అటువంటిదే . భక్తి అంటే భగవంతుని పై పరమ ప్రేమ.  ఆ పరమ ప్రేమ హృదయంలో  ఆవేశిస్తే భక్తుడి కంఠం గద్గద మవుతుంది, శరీరం పులకరిస్తుంది. కండ్ల నుండీ నీరు స్రవిస్తుంది.  అంతటి  భక్తిగల భక్తులు  తమ వంశాన్ని,  ఈ భూమినీ పావనం చేస్తారని నారద మహర్షి సైతం చెప్పారు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: