🕉 మన గుడి : నెం 1338
⚜ తమిళనాడు : తంజావూరు
⚜ శ్రీ కంపహరేశ్వరర్ ఆలయం
💠 కంపహేశ్వర ఆలయం లేదా కంప-హర-ఈశ్వరర్ (కంప-హరేశ్వరర్) అనేది శివుడికి అంకితం చేయబడిన దేవాలయం.
ఇది దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని తిరుభువనంలో, మైలదుత్తురై-కుంభకోణం రహదారిపై ఉంది.
💠 పురాణాల ప్రకారం బ్రాహ్మణుడిని పొరపాటున చంపిన కారణంగా పాపము వెంటాడుతున్న రాజు శివుని కృపవల్ల కంప (పాపం) నుండి ఉపశమనం పొందాడని నమ్ముతారు. అందువలన శివునికి కంపహరేశ్వరుడు అనగా పాపములను హరించువాడు అనే పేరు వచ్చింది.
💠 కంపహరేశ్వరర్ లేదా శరభేశ్వర్ ఆలయం శివకేశవులు భక్తులను, ఋషులను మరియు దేవతలను రక్షించుటకు దుష్టులైన రాక్షసుల సంహారానికి అనేక సందర్భాలలో వివిధ రూపాలలో అవతరించారు అన్నది సుస్పష్టం.
💠 పరమశివుడు ద్వాదశ జ్యోతిర్లింగ తదితర క్షేత్రాలలో లింగరూపుడై దర్శనం ఇస్తాడు.
కొన్ని క్షేత్రాలలో ముఖంతో ఉద్భవించినట్లు అట్టి ఆలయాల గురించి పురాణాల్లో వివరించడం జరిగింది.
💠 మహావిష్ణువు మిగిలీన రూపాలకు భిన్నంగా సగభాగం సింహరూపంతో సగభాగం మానవరూపంతో నరసింహ అవతారంలో హిరణ్యకశిపుని సంహరించాడు.
ఆ విధంగానే శివుడు విబిన్నమైన శరభ రూపంలో అవతరించి ఉగ్రరూపుడైన నరసింహుని శాంతింపచేసినట్లు పిమ్మట కంపహరేశ్వరర్ పేరుతో లింగరూపంలో వెలసినట్లు తెలుస్తూంది.
💠 ఈ పురాతన కంపహరేశ్వరర్ దేవాలయంనందు శివుడు లింగరూపంలో పూజించబడే ప్రధానదైవం.
💠 హిరణ్యకశిపుని సంహరించిన పిమ్మట నరసింహుని ఉగ్రరూపం నుండి శివరూపమైన కంపహరేశ్వరర్ దేవతలను రక్షించాడని నమ్ముతారు.
💠 ఉత్సవ మూర్తి మూడుకాళ్ళతో, సింహపు శరీరం, ముఖం, తోక మరియు నాలుగు చేతులతో కనిపిస్తుంది.
శరబేశ్వరుడు సమస్త దుష్టగ్రహములను, శత్రువులను నాశనం చేస్తాడని భక్తుల నమ్మకం.
💠 పౌరాణిక గ్రంధాలలో శరభ అనునది మహావిష్ణువు నరసింహ అవతారంలోని తీవ్ర స్వభావం నుండి శాంతపరచడానికి అవతరించిన శివరూపంగా చెప్పబడింది.
శరభ విష్ణువు యొక్క నరసింహ రూపంతో పోరాడే పురాణ కధనం విష్ణుభక్తులకు మరియు శివభక్తుల మధ్య అభిప్రాయ భేదం బహిర్గతం చేస్తుంది.
💠 పురాణ గ్రంధములందు ఎక్కడా శివకేశవులు తమలో ఆధిపత్యంపై విభేధించినట్లు చెప్పబడలేదు.
ప్రముఖ విష్ణుక్షేత్రం బదరీనాధ్ లో పరమశివుడు బదరీనాధుని ప్రతిష్టించి తాను ఆదికేదారేశ్వర్ రూపంలో ఇరువురు స్వయంభూః మూర్తులుగా, రామేశ్వరలింగాన్ని ప్రతిష్టించిన మహావిష్ణువు అవతారం శ్రీరాముడు శివుని అర్చించి కోదండరాముని పేరుతోనూ ప్రసిద్ధి చెందినట్లు పురాణములందు ప్రస్తావించబడినది.
💠 శివాంశ శంభూతుడైన ఆంజనేయుడు శ్రీరాముని ప్రధమభక్తుడు అనేది విశేషం. హింధువులు శివకేశవులను సమాన ప్రాతినిధ్యంతో పూజిస్తూ అన్ని క్షేత్రాలు దర్శిస్తారు.
కొద్దిమంది శైవులు మరియు వైష్ణవుల మధ్య ఆభిజాత్యపోరు ఉన్నమాట వాస్తవం. కానీ శివ కేశవులు ఒక్కరే వేరుకాడు అన్నది సుస్పష్టం.
💠 ఉగ్ర్రరూపుడైన నరసింహుని ఆయన భక్తుడు ప్రహ్లాదుడు స్తుతించి శాంతపరచినట్లు, లక్షీదేవి చెంచులక్ష్మిగా అవతరించి శాంతపరచినట్లు ఆంధ్రప్రదేశ్ నందు కర్నూలు జిల్లాలో ప్రముఖ విష్ణుక్షేత్రమైన అహోబిలం క్షేత్రపురాణం బట్టి తెలుస్తూంది.
కానీ ప్రస్తుత కధనం ప్రకారం స్థితికారకుడైన విష్ణువు నరసింహుని ఉగ్రరూపంలో ఉన్నట్లయిన ప్రకృతి సమతుల్యతకు విఘాతమని భావించి, విష్ణువు నరసింహ శరీరం వదలి దైవిక రూపానికి మారడం కోసం శివుడు శరభ రూపాన్ని ధరించాడని తెలుపబడింది.
💠 నరసింహుడు తన శరీరంతో శరభును కొట్టగా శరభుడు ఉగ్రరూపందో నరసింహునిపై దాడిచేసి నియంత్రించినట్లు తెలుస్తూoది. అప్పుడు విష్ణువు శరభ రూపంలో ఉన్నది శివుడు అని గ్రహించి శరభను స్తుతించాడని, శివుడు విష్ణువును దీవించి రాక్షసులను సంహరించడానికి వరం ఇచ్చాడని, శరభ తన కోపాన్ని భరించలేని దేవతలు భయంతో శివుడిని శరభ రూపాన్ని విడిచిపెట్టమని కోరగా శివుడు శరభరూపం ఛిద్రం చేశాడు;
💠 నరసింహుడు మళ్లీ ప్రశాంతమైన విష్ణువుగా మారడం మరియు శరభ శివడు లింగ రూపునకు మారిన పిమ్మట శరభుని అవయవాలు ఛిద్రమై భయంకర రూపమైన అతని మొండెం కాపాలికగా మారింది.
💠 ఆలయంలోని మూలవర్ శివలింగం కంపహేశ్వరర్ అని పిలుస్తారు.
అంబల్, గణేశ, సుబ్రమణ్య, నటరాజర్, శరబేశ్వరర్ మరియు నాయన్మార్గులకు ప్రత్యేక సన్నిధులు ఉన్నాయి.
💠 రోజుకు నాలుగు సార్లు నిర్వహించే రోజువారీ పూజలతో పాటు, సోమవారం మరియు శుక్రవారం వంటి వారపు ఆచారాలు , ప్రదోషం వంటి పక్షం రోజుల ఆచారాలు మరియు అమావాస్య , పౌర్ణమి , కిరుతిగై మరియు శతుర్థి వంటి నెలవారీ పండుగలు ఉన్నాయి.
💠 ఆలయ అత్యంత ప్రముఖ పండుగ, థైపూసం, థాయ్ నెలలో (జనవరి మధ్యలో) పది రోజులు జరుపుకుంటారు .
💠 చిత్తిరై బ్రహ్మోత్సవాలు, మార్గజి తిరువాతిరై, కార్తీక దీపం మరియు ప్రదోషం ఈ ఆలయంలో అత్యంత వైభవంగా ఉత్సాహంతో జరుపు ఉత్సవాలు.
💠 ఈ ఆలయం కుంభకోణం నుండి 35 కి.మీ దూరం
©️ Santosh Kumar
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి