27, డిసెంబర్ 2025, శనివారం

ముగ్గురు స్నేహితుల నిజమైన కథ.

 *ఇది ముగ్గురు స్నేహితుల నిజమైన కథ.👉*

*1) మొదటి వాడు చాలా తెలివైనవాడు, స్కూల్లో ఎప్పుడూ ఫస్ట్ పొజిషన్‌ వదిలేవాడు కాదు. ప్రతి విషయంలో టాపర్‌.*

*2)రెండోవాడు సాధారణం, ఫెయిల్‌ అవ్వడు కానీ తరగతి నుంచి తరగతికి కేవలం నెట్టుకొని వెళ్లేవాడు.*

*3)మూడోవాడు చతురుడు,మోసగాడు,omanipulation లో నిపుణుడు.*

*కానీ ఈ ముగ్గురూ మంచి స్నేహితులు… చాలా దగ్గర. స్కూల్ పూర్తయ్యాక…*

*1)మొదటి వాడు—ఆ తెలివైన వాడే—ఇంజనీర్ అయ్యాడు.* 

*Indian Engineering Services పరీక్ష పాస్ చేసి, క్లాస్ వన్ ఆఫీసర్ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ మెట్రో చీఫ్ అయ్యాడు.*

*2)రెండోవాడు ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసి సివిల్ సర్వీసెస్‌ పరీక్ష రాశాడు. ఉత్తీర్ణత సాధించి, తన మొదటి స్నేహితుడు పని చేస్తున్న శాఖలో అతనికంటే ఉన్నత స్థాయి అధికారిగా నియమితుడయ్యాడు.*

*3)మూడోవాడు స్కూల్ తరువాత చదవటం కూడా పట్టించుకోలేదు. సరైన సమయంలో సరైన రాజకీయ పార్టీని ఎంచుకున్నాడు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. ఎంపీ అయ్యాడు. ఆ తర్వాత కేబినెట్ మంత్రిగా మారాడు. అతడి ఆధ్వర్యంలోనే మిగతా ఇద్దరు స్నేహితులు పనిచేస్తున్నారు.*

*ఇది కల్పిత కథ కాదు.👉 నిజం:*

*1)మొదటి వాడు — ఈ. శ్రీధరన్ — మెట్రోమ్యాన్*

*2)రెండోవాడు — టి.ఎన్. శేషన్ — మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్*

*3)మూడోవాడు — కె.పీ. ఉన్నికృష్ణన్ — ఐదు సార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నికై, వి.పీ.సింగ్ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రి*

*ముగ్గురు స్నేహితులు 👉 అదే స్కూలు, అదే టీచర్లు… కానీ విధి మాత్రం వేర్వేరు మార్గాల్లో నడిపించింది! 🤔🤔🤔🤔*

కామెంట్‌లు లేవు: