🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏
🌺*శుభోదయం*🌺
-------------------
🏵️ *మహనీయుని మాట*🏵️
-------------------------
"అధర్మాన్ని ఆచరిస్తే పుత్రులనైనా క్షమించరాదు.
ధర్మాన్ని ఆచరిస్తే శత్రువును అయినా చేరదీయవచ్చు."
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌹
---------------------------
"అవసరం చాలా గొప్పది.
తెగిపోతున్న బంధాన్నీ కలుపుతుంది.
బలంగా ఉన్న బంధాన్నీ తెంపుతుంది."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 26 - 12 - 2025,
వారం ... భృగువాసరే (శుక్రవారము)
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనము,
హేమంత ఋతువు,
పుష్య మాసము,
శుక్ల పక్షము,
తిథి : *షష్ఠి* ఉ 10.05 వరకు,
తదుపరి *సప్తమి*
నక్షత్రం : *పూర్వాభాధ్ర* తెల్లవారుజామున 5.55 వరకు,
తదుపరి *ఉత్తరాభాధ్ర*
యోగం : *సిద్ధి* మధ్యాహ్నం 12 వరకు,
తదుపరి *వ్యతీపాత*
కరణం : *తైతుల* ఉదయం 10.05 వరకు,
తదుపరి *గరజి*
రాహుకాలం : *ఉ10.30 నుండి 12.00 వరకు*
దుర్ముహూర్తం : *ఉ8.43 నుండి 9.26 వరకు*
*తిరిగి 12.21 నుండి 01.05 వరకు*
వర్జ్యం : *మ 12.36 నుండి 2.11 వరకు*
అమృతకాలం : *రా 10.03 నుండి 11.37 వరకు*
సూర్యోదయం : 6.31,
సూర్యాస్తమయం : 5.28,
*_నేటి పాశురం_*
*తిరుప్పావై – 11వ పాశురము*
*కత్తు క్కఱవై క్కణంగళ్ పల కఱన్దు*
*శెతార్ తిఱ లళియ చ్చెన్రు శెరుచ్చెయ్యుమ్*
*కుత్త మొన్రిల్లాద కోవలర్దమ్ పొర్కొడియే*
*పుత్తర వల్గుల్ పునమయిలే పోదరాయ్*
*శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వన్దు నిన్*
*ముత్తమ్ పుగున్దు ముగిల్ వణ్ణన్ పేర్పాడ*
*శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ*
*ఎత్తు క్కురంగుమ్ పొరుళే లోరెమ్బావాయ్.*
*తాత్పర్యము:-*
లేగదూడలు గలవియు, దూడల వలె నున్నవియు, నగు ఆవుల మందల నెన్నింటినో పాలు పితుకగలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును, ఏవిధమగు దోషము లేనివారును అగు గోపాలకుల వంశమున మొలచిన ఓ బంగారుతీగా ! పుట్టలోని పాము పడగవలె నన్ను నితంబప్రదేశము గలదానా ! అడవిలోని నెమలివలె అందమైన కేశపాశముతో ఒప్పుచున్నదానా ! రమ్ము. చుట్టములును, చెలికత్తెలను మొదలుగ అందరును వచ్చిరి. నీముంగిట చేరిరి. నీలమేఘవర్ణుడగు శ్రీకృష్ణుని నామము కీర్తించుచుండిరి. కీర్తించుచున్నను నీవు ఉలుకక పలుకక ఉన్నావేమి? ఓ సంపన్నురాలా ! నీ నిద్రకు అర్థమేమో తెలుపుము.
*_🌹శుభమస్తు🌹_*
🙏 సమస్త లోకాః సుఖినోభవంతు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి