29, మే 2020, శుక్రవారం

హోమియోపతిమీద చిన్న చూపు ఎందుకు

 హోమియోపతిమీద చిన్న చూపు ఎందుకు
నానాటికి పెరుగుతున్న కరోనా కేసులు మానవాళిని భయభ్రాంతులను చేస్తున్నది.  అటు అల్లోపతి వైదులు అహర్నిశలు వివిధ పరిశోధనలు చేస్తూ కరోనా వైరస్ కు వాక్సిన్ కనుక్కోవాలని ప్రయత్నిస్తున్నారు.  అది మంచి విషయమే కానీ మనకు తెలుసు ప్రపంచంలో ఒక్క అల్లోపతి వైద్య విధానమే లేదు అల్లోపతికన్నా ముందుగా ప్రజలు రక రకాల వైద్య విధానాలను పాటించారు.  అంతేకాక వాటితో చాల ప్రయోజనాలను పొందారు.  అల్లోపతి అంటే సూదులతో మందులు పొడవటం, కత్తులతో కండలు తీయటం ఈ రెండు ఇతర వైద్య విధానాలలో లేక పోవచ్చు.  కానీ హోమియో పతి వైద్య విధానంలో సాధారణ అల్లోపతి వైద్య విధానంలో ఉన్న సర్జికల్ కేసు అంటే ఆపరేషన్ చేసి చికిత్స చేసే రోగాన్ని కూడా ఎటువంటి ఆపరేషన్ లేడకుండా కేవలం హోమియోపతి చిన్న చెక్కర పిల్స్ లతో తగ్గించవచ్చు అంటే ఎంతమంది నమ్ముతారు.  నిజానికి ఇది నూటికి నూరు శాతం నిజం.  కానీ మనం అల్లోపతి వైద్యంమీద చూపే శ్రధ్ద ఈ హోమియోపతి విధానంపై చూపక పోవటం విచారదాయకం. 
సాధారణంగా వచ్చే అనైక బాక్టీరియల్, ఫంగస్ వ్యాధులకు అల్లోపతిలో అంటి బైయటిక్, యాంటీఫంగల్  మందులు ఇచ్చి నయం చేస్తారు. ఈ మందులు రోగి శరీరం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి.  అంతేకాదు వీటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.  ఈ సైడ్ ఎఫెక్ట్సతో రోగి రోగం తగ్గినా ఎంతో కాలం అనారోగ్యంతో బాధపడాలి.  కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని నెలలవరకు రోగిని నిస్సత్తువ చేస్తాయి.  శరీరంలో వున్న విటమినులు హరించటం వల్ల కాళ్ళ తీపులు, నొప్పులు ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.  కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చాల భయంకరంగా ఉంటాయి.  కాగా హోమియోపతి వైద్యంలో ఉపయోగించే మందులు అల్లోపతి మందులతో పోలిస్తే అంత ప్రమాదకరం కాదు.  కానీ వైద్యులు సరైన పొటెన్షిలో మందు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు కలుగుతాయి.  కాబట్టి రోగి యొక్క రోగ తీవ్రత, అతని మానసిక శారీరిక అలవాట్లు అతని శరీర తత్త్వం మొదలైన విషయాలను కూలంకుషంగా పరిశీలించి తగువిధంగా మందు, మందుపొటెన్షి నిర్ధారణ చేసి మందు ఇస్తే హోంయోపతి మందులు చక్కగా పనిచేస్తాయి. 
హోమియోపతి వైద్యులు కొంతమంది కమర్షియల్ అయి వైద్యవిధానాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు.  వారి వల్ల హోమియోపతి వైద్య విధానంపై ప్రజలకు సరైన నమ్మకం కుదరకపోతున్నది. నేను గమనించింది.  1) వైద్యులు వారు ఇచ్చే మందుల పేర్లు, మందు పొటెన్షిని రోగికి చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నారు, 2) రోగానికి సంబందించిన సరైన మందు తెలిసిన రోగి తిరిగి, తిరిగి తనవద్దకు రావాలని మళ్ళి మళ్ళి కన్సల్టేషన్ ఫీజు వసులు చేయాలనే దురుదేశంతో కొంతమంది డాక్టర్లు రోగానికి సరైన మందు, పొటెన్సీ సంపూర్ణంగా తెలిసినాకూడా తక్కువ పొటెన్సీతో లేక్ కేవలం షుగర్ పిల్స్ ఇచ్చి రోగాన్ని ముదరపెట్టి తరువాత రెండు మూడు సార్లు రోగిని తిప్పుకొని తరువాత రోగికి సరైన మందు ఇచ్చి రోగాన్ని తగ్గి స్తున్నారు.  ఈ పద్దతి వల్ల డాక్టర్లు ధనార్జన చేస్తున్నారు.  కానీ రోగి తనకు వెంటనే ఉపశమనం కలుగక కొంతమంది ఆ డాక్టర్ని వదిలి వేరే డాక్టర్ని కలుస్తున్నారు.  అది తిరిగి హోంయో పతి డాక్టరు ఐతే ఆతను ఇలాంటి స్ట్రిక్స్ ఉపయోగిస్తే రోగికి పూర్తిగా వైద్యం మీద డాక్టర్లమీద నమ్మకం పోతుంది. డాక్టర్ ఇచ్చిన మందుల వివరాలు ప్రిస్క్రిప్షన్లో వ్రాయడు కాబట్టి కొత్త డాక్టర్ మళ్ళి తన ఛాన్స్ తీసుకుంటాడు.  దీనితో రోగికి అనేక ఇబ్బందులు కలుగుతాయి.  నేను డాక్టర్లని కోరేది ఏమిటంటే మీరు ఇచ్చిన మందుల వివరాలు తప్పనిసరిగా రోగికి తెలియచేయాలి, అది మీ కనీస వృత్తి ధర్మం.  మీరు మీ వృత్తికి ద్రోహం చేస్తున్నారు.  మీలాగా చాలామంది చేయటంతో ప్రజలలో హోమియోపతి వైద్యవిధానం మీద నమ్మకం సన్నగిల్లుతుంది. 
నిజానికి డాక్టర్ నిష్కపటంగా, లాభాపేక్ష పరుడు కాకుంటే చాలా రోగాలు సులువుగా హోంయోపతి వైద్య విధానంలో తగ్గించ వచ్చు. 
ఇక ఇప్పటి కరోనా విషకోరల గూర్చి చూద్దాం. ఇతర రోగాల మాదిరిగా కరోనా రోగానికి కూడా కొన్ని నిర్దుష్ట లక్షణాలు వున్నాయ్. వేరే రోగాలను ఎలా ఐతే హోమియో డాక్టర్ లక్షణాలు తెలుసుకొని నివారణ చేస్తున్నాడో అదే విధంగా ఈ కరోనా రోగాన్ని కూడా సమర్దుడైన హోమియోవైదుడు తగ్గించ గలడు. 
ప్రస్తుతం WHO కేవలం అల్లోపతినే నమ్ముకొని వున్నది.  అది తప్ప ప్రపంచంలో వేరే వైద్యం లేనట్లు కేవలం వాక్సిను తోటె ఈ రోగాన్ని తగ్గించ వచ్చు వేరే మార్గం లేదు అని అనుకుంటున్నది. కానీ ఈ రోగాన్ని మేముకూడా తగ్గించ గలం మాకు అవకాశం ఇవ్వండి అని హోమియోపతి వైద్యులు వేనోళ్ల అడుగుతున్నా వారిని పట్టించుకోటంలేదనేది మనకు అందుతున్న సమాచారం. 
దయచేసి ప్రభుత్వం ఈ సమయంలో ఇతర వైద్య విధానాలకు కూడా అల్లోపతి తో సమాన ప్రాతినిధ్యాన్ని ఇచ్చి ప్రస్తుత కరోనా విపత్తునుండి ప్రజలను కాపాడాలని కోరుతున్నాను.,
ఇది చదివినవారు దయచేసి మీ మీ గ్రూపులతో దీనిని  పొందుపరచి మన ప్రభుత్వాన్ని చేరే దాకా ప్రయత్నించాలని తత్ ద్వారా సర్వ మానవాళి ఈ విషమ కరోనా రోగంనుంచి విముక్తులు కావాలని కోరుతున్నాను. 

సార్వే జన సుఖినోభవంతు,
ఓం శాంతి శాంతి శాంతిః






24, మే 2020, ఆదివారం

రేపు ఏమిచేస్తారు


 రేపు ఏమిచేస్తారు
 అటు కరోనా విషకోరలు చాపుతూ రోజు రోజుకు వేగంగా విజృంబిస్తున్నది.  ఇటు ప్రభుత్వాలు కరొనతో కలిసి జీవించాలని ప్రభోదిస్తూ రోజుకో విధంగా లాక్ డౌన్ సడలింపులు చేస్తున్నారు.  అటు బస్సులు, ఇటు రైళ్లు, విమానాలు ప్రయాణాలకు సిద్ధమితున్నాయ్.  మరి ప్రభుత్వం తీసుకునే చర్యలు.  ధర్మో టెస్టింగ్ అంటే శరీర టెంపరేచర్ చూసి ప్రయాణానికి అనుమతించాలని అంటున్నారు.  బాగానే వుంది.  కానీ మనం చూస్తున్నాం ఎన్నో కేసులు కేవలం క్యారియర్సగా వున్నవారు వున్నారు అంటే కరోనా పాజిటివ్ వున్నా కానీ వారు ఎలాంటి రోగ లక్షణాలు కనపడకుండా పూర్తి ఆరోగ్యవంతుడిలా కనపడతాడు.  కానీ అతనిద్వారా ఇతరులకు రోగాన్ని అంటించగలరు.  మరి వారిని ఎలా తెలుసుకుంటారు.  స్క్రీనింగ్ లో ఎలాంటి లక్షనాలు కనపడని వారిని ప్రయాణించటానికి వదిలితే ఆ రైలు, విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులకు రోగ సంక్రమణ చెందదని ఎలా చెప్పగలరు. అదే జరుగుతే మరి ఈ రోగాన్ని ఎలా అదుపు చేస్తారు.  మన భరత్ మరో ఇటలీ అవుతుందా అని మేధావులు అంటున్నారు.  ప్రభుత్వం ఈ విషయాలన్నీ కూలంకుషంగా పరిగణలోకి తీసుకొని రైలు, విమాన రవాణాను అనుమతించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మన దేశంలో రోగులకు సరిపడ హాస్పత్రులు లేవని ముందే చెప్పారు.  తగినన్ని PPT కిట్లు లేవు, ఇక వెంటిలేటర్ల విషయానికి వస్తే మన దేశంలో వెంటిలేటర్ల కొరత వున్న సంగతి మనకు తెలుసు.  మరి ఈ మహమ్మారి ఒకేసారి విజృంభిస్తే ఎలా అదుపుచేయాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. 
ప్రజలు ఏది ఏమైనా ఎట్టి పరిస్థితిలో ఇల్లు వదలి బైటికి రాకుండా ఉండటమే మనకు శ్రీరామ రక్ష.  కరోనా వచ్చినవారు కొంత మంది కోలుకున్నారు మనం భయపడాల్సిన ఆవాసరం లేదు అని అనుకున్నామా అంటే నీకు కరోనా వస్తే పూర్తిగా కోలుకోగలవా ఆలోచించు. కోలుకొన్నవారి లిస్టుతో పాటు మరణించిన వారి లిస్టు కూడా రోజు రోజుకు పెరుగుతున్నది.  నీ పేరు ఏ లిస్టులో ఉంటుందో నీవు వూహించగలవా.  మనం ఏ విషయంలో నైనా చాన్సు తీసుకోవచ్చు కానీ మన జీవితం విషయంలో చాన్సు తీసుకోగలమా.  ఆలోచించండి. ఒక్కసారి ఈ కరోనా రోగంగూర్చి విచారిద్దాం. ఇది కరోనా సోకినా రోగుల ద్వారా వ్యాపిస్తుంది.  ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ కరోనా వైరస్ మెటల్ బాడీస్ మీద, ప్లాస్టిక్ మీద మరియు ఇతర పదార్ధాల మీద ఎక్కువ సమయం ఉంటుంది.  ఆ పదార్ధాలను ఎవరైనా తాకి ఆ చేతితో మూతి మీద, కంటిమీద, ముక్కుమీద పెట్టుకుంటే అది ఆ మనిషి శరీరంలోకి ప్రవేశించి మొదట్లో గొంతులో తరువాత ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి శ్వాస తీసుకోటం కష్టం ఐతుంది తరువాత ఆక్సిజన్ లభించక రోగి చనిపోతాడు.  ఐతే రోగ నిరోధక ఎక్కువగా వున్న వారు ఈ వైరస్ తో పోరాడి రోగ విముక్తుల కాగలరు.  ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఎవరి రోగనిరోధకత ఎంతవరకు ఉంటుంది అనేది ఎవ్వరు తేల్చి చెప్పలేరు.  కొందరు శారీరికంగా దృఢంగా ఉండవచ్చు కానీ వారి రోగనిరోధకత తక్కువగా ఉండవచ్చు. కొందరు చూడటానికి బక్కగా వున్నా వారి రోగనిరోధకత ఎక్కువగా ఉండవచ్చు. ఒక మనిషి రోగనిరోధకత స్థాయి ఏ మేరకు ఉందొ తెలుసుకొనే సాదనం ఇంతవరకు లేదు. మన సైన్స్ ఇంకా అంతదాకా ఎదగ లేదు. ఏతా వాత తెలిసేది ఏమంటే ఇప్పుడు వున్న పరిస్థితిలో అంతా ఊహాగానాలే ఇదమిద్ధంగా ఇలా ఉంటే రోగం రాదని ఇలా ఉంటేనే రోగం వస్తుందని ఏ వైద్యుడు, శాస్త్రజ్ఞుడు చెప్పే స్థితిలో లేరు.  మరి ఇలాంటి పరిస్థితిలో ఆర్ధిక వృద్ధికోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టటం ఎంతవరకు కరక్ట్.  మన దేశంలో విద్యా వంతులు అంతంతమాత్రం.  అందులో చదువుకున్న వారికి కూడా నిజం చెప్పాలంటే కరోనా మీద సరైన అవగాహన లేదు.  ఇక చదువురాని వారి సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.  అందరికిని  తెలియ చేయునది ఏమనగా మనం ఇప్పుడు చాలా ప్రమాద స్థితిలో వున్నాం.  ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తి వేయవచ్చు, పోలీసులు ఇదివరకులా మన వెంట పడక పోవచ్చు కానీ కరోనా ఎప్పుడైనా ఎవరినైనా సోకవచు. తస్మాత్ జాగ్రత్త. 
కరోనా రోగులు గణనీయంగా పెరిగితే మన దేశ ప్రస్తుత వనరుల అందుబాటు ప్రకారం రోగగ్రస్తులకు సరైన వైద్యం లభించక పోవచ్చు. ఈ విషయం ప్రతి వక్కరు తెలుసుకోవలసిన అవసరం వుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలోకూడా ఇంటినుండి బైటికి రాకుంటేనే మనలను మనం కాపాడుకోగలం. 
ఒక్క విషయం హాస్పటల్లో చికిత్స అంటూ ప్రత్యేకించి ఏమి చేయటంలేదు. కేవలం రోగనిరోధకత పెంపు చేసే ఆహరం, ఇతర మందులు ఇస్తున్నారు.  కోలుకోవటం అనేది వారి వారి అదృష్టం మీద ఆధారపడి వుంది. 
ఏరకంగా చూసినా ప్రభుత్వ నిర్ణయం భయానకంగా వున్నది. 

22, మే 2020, శుక్రవారం

ఎమర్జెన్సీ ప్రకటించాలి

కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించాలి 
కరోనా కేసులు మాములుగా వున్నప్పుడు లాక్ డౌన్ చాలా సీరియస్ గా వుంది. లాక్ డౌన్ ఒకదాని తరువాత ఒకటిగా పెంచుకుంటూ పోతున్నప్పుడు కేసుల పెరుగుదల రేటు తదనుగుణంగా వృద్ధి చెందుతూ వున్నది.  కానీ ఇప్పుడు పరిస్థితి చుస్తే కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి కానీ ప్రభుత్వాలు అంత సీరియస్ గా పట్టించుకుంటున్నట్లు తెలియటంలేదు.  ఇక్కడ తెలంగాణాలో టెస్టులు ఎక్కువగా చేయడంలేదని అభియోగాలు వస్తున్నాయి.  అంతేకాదు కేంద్ర ఆరోగ్య శాఖా కార్యదర్శి ఇక్కడి కార్యదర్సులతో వివరాలు అడిగినట్లు వాట్సాప్ సమాచారం.  ఇది ఎంతవరకు నిజం తెలియదు.  రోజు వాట్సాప్ సమాచారాలు వివిధ రకాలుగా వస్తున్నాయి.  కొన్ని చోట్ల రాజకీయ నాయకులు  పోలీసులపై జులుం చేస్తున్నట్టు వీడియోలు వస్తున్నాయి.  అవి నిజామా కదా అనేది ప్రభుత్వం చెప్పాలి.  ఏ పోలీసు ఉన్నతాధికారి కూడా రాజకీయనాయకులు పోలీసులపై వత్తిడి చేస్తున్నట్లు చెప్పటంలేదు.  నిజంగా నాయకులు పోలీసులపై వత్తిడి (దౌర్జన్యం)  చేస్తే మరి పోలీసులు నాయకులపై కేసులు పెట్టటానికి ఎందుకు వెనకడుతున్నట్లు తెలియటంలేదు. ప్రస్తుతం భారత్ ప్రభుత్వం కరొనను దృష్టిలో ఉంచుకొని ఎవరైనా డాక్టర్లమీద కానీ పోలీసులపై కానీ దౌర్జన్యం చేస్తే చాల తీవ్రంగా పరిగణించి కఠినంగా శిక్షించేటట్లు చట్టాలు చేసిన సంగతి మనకు తెలిసిందే,  ఈ నేపథ్యంలో పోలీసులు రాజకీయ నాయకులకు  ఎందుకు భయపడుతున్నారు.  మీడియా కూడా కొన్ని విషయాలను ధైర్యం చేసి చూపించట్లేదని వాట్సాప్లో వస్తున్నాయి. .  ఇట్లా ప్రజలలో వివక్షత చూపిస్తే కరోనా కట్టడి చేయటం చాల కష్టం అవుతుంది. కేవలం కొంతమంది జనం లాక్ డౌన్ పాటిస్తే సరిపోదు కరోనా బైట తిరిగే వారు ఎవరైనా కుల, మత, వర్గ, లింగ భేదం లేకుండా అందరికి సోకుతుంది.  ఇది సత్యం ఇట్టి స్థితిలో కొంతమంది మీద వివక్షత చూపి లాక్ డౌన్ సడలిస్తే దేశం యావత్తు దాని మూల్యంగా  రేపు తీవ్రంగా బాధ పడవలసి వస్తుంది.
అటు మద్యం దుకాణాలు తెరచి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు  ఒకరకంగా కరోనాని తలుపులు తెరచి ఆహ్వానించినట్లు చేసారు . గ్రీన్ జోన్లలో అన్ని దుకాణాలు తెరవచ్చని అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు తెరవవచ్చోని  ఆదేశాలు ఇచ్చారు. మరి అందరు ఎంతవరకు సురక్షితంగా వుంటారు అనేది ప్రశ్న. జనాల ప్రాణాలకు ఎవరు భాద్యత వహిస్తారు.
మన దేశంలో వున్న హాస్పిటల్స్ మన జనాభాకు తగినంతగా లేవని మొదటి నుంచి చెపుతున్నారు. ఇక PPT కిట్లు N 95 మాస్కులు, వెంటిలేటర్లు ఏ మాత్రం వున్నాయి అవి ఎంతవరకు మన కరోనా పోరాటంకు దోహదపడుతాయి అన్నది ప్రశ్నర్ధకంగా వున్నది. మనము దేశ ఆర్ధిక వృద్ధిని ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి సాదించాలా అని మేధావి వర్గం అంటున్నాయి.  మొన్న మద్యం దుకాణాల వల్ల ఎంతో మంది వాళ్ల అమూల్య ప్రాణాలు పోగొట్టుకున్నారని  మనం వార్తల్లో చూసాం. ఆంద్రప్రదేశ్ కన్నా మన రాష్ట్రములో మద్యం ధర కొంచం తక్కువ అని మన రాష్ట్ర హద్దులలో వున్నా జిల్లాలోకి ఆంధ్రా జనం వచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం.  ఇది సరిహద్దులు దాటి రావటం అవుతుంది.  దీనివల్ల కరోనా కట్టడి ఎంతవరకు ఉంటుంది.  అటు మద్యం దుకాణాకారులు వారికి సరిహద్దు ఆవాలు వినియోగదారుల వల్ల ఎక్కువ లాభాలు వస్తూవుంటే వారు ఎందుకు ఈ విషయాలను ప్రభుత్వ దృష్టికి తెస్తారు అని ప్రజలు అంటున్నారు.  ఇకపోతే 40 రోజుల పైన ఒక్క చుక్క సారా కూడా తాగని మద్యపాన ప్రియులు ఒక్కసారిగా సాగారు డాం గేట్లు తెరచినట్లుగా ప్రవాహంలా దూకి సామాజిక దూరం పాటించకుండా లిక్కర్ కొనటానికి వస్తున్నారు. ఇక  10 వ తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే యుక్త వయసులో వున్నా పిల్లలు కరోనాకు బాలి కాకుండా కాపాడటం ఎలా.   మొన్న మహబూబునగరు లో out sourcing ఉద్యోగాల నియామకానికి ఎంతమంది గుమికూడి వచ్చారో చూసాం.  అందులో ఎవరికైనా పాజిటివ్ వచ్చిందా? తెలియదు టెక్ష్ట్స్ చేసారా తెలియదు. వలస కూలీల పరిస్థితి దయనీయంగా వున్నది.  కొంతమంది వారి ఊళ్లకు వెళ్లకుండానే మధ్యలోనే మరణించారు. కొందరు అటు వల్ల ఊరికి పోలేక వున్నచోట ఉండలేక నానా బాధలు పడుతున్నారు.
ఇప్పటి మన భారత దేశ పరిస్థితి ఏమిటంటే పూర్తిగా వ్యాధి వ్యాపించకుండా చేసుకోవటమే అంతకు మించి వేరే గత్యంతరం లేదు.  రోగులకు చికిత్స లేదు అని డాక్టర్లు గంటాపధంగా చెపుతున్నారు. ప్రజలలో ఓపిక నశించి ఇంటినుంచి బైటకు వస్తున్నారు.  అది కేవలం వారి వారి ప్రణాలను పణంగా పెట్టటమే అని ఎన్ని విధాలుగా చెపుతున్నా వినే స్థితిలో ఎవ్వరు లేరు.
అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఉమ్మడిగా కఠినంగా లాక్ డౌన్ పొడిగించటం మినహా మనము కరోనా నుండి కాపాడుకోటం వీలు కాదు.  అది ఎన్ని రోజులు, ఎన్ని నెలలు అని అందరు అంటున్నారు.  ఎన్ని నెలలు ఐనా భరించాలి తప్పదు.
ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో ఒకేవిధమైన నియమ నిబంధనలతో లాక్ డౌన్ నియమించాలి.  అది కేవలం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి పూర్తి దేశాన్ని కేంద్ర ప్రభుత్వం తన కంట్రోల్కి తీసుకొని ఒకే విధానాన్ని దేశం మొత్తం కఠినంగా అమలు చేయాలి.  కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించక పొతే మునుముందు పరిస్థితి పూర్తిగా చేయి దాటి పోయా ప్రమాదం వుంది.
కాబట్టి మన దేశ ప్రధానమంత్రి గారికి విన్న వించుకునేది ఏమనగా దేశ ప్రజల క్షేమం పరిగణలోకి తీసుకొని వెను వెంటనే  ఎమర్జెన్సీ ప్రకటించి మన దేశాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను.
సి. భార్గవ శర్మ న్యాయవాది, హైదరాబాద్.


21, మే 2020, గురువారం

బ్రహ్మ జ్ఞ్యానం



 మనకు ఇంద్రియగోచరమైనది జగత్తు. ఈ జగత్తులో వున్నది ఒకటే అది జ్ఞానం. ఈ జ్ఞానం అనంతమైనది, అద్వితీయమైనది, అపారమైనది. అనన్యమైనది, శాశ్వితమైనది. అందుకే దానిని బ్రహ్మ జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం జగత్తులో వున్నా ఇది జగత్తు కాదు జగత్తుకన్నా భిన్నంగా వుండివుంది.   బ్రహ్మ శబ్దం అత్యుత్తమమైనదానికి మాత్రమే వాడుతారు. ఈ ప్రపంచంలో మనుషులను బ్రహ్మజ్ఞ్యాన పరంగా రెండు రకాలుగా విభజింపవచ్చు. 1) జ్ఞానం కలిగినవారు వారిని బ్రహ్మ జ్ఞానులు అంటారు.  2) జ్ఞ్యానం లేనివారు వారిని బ్రహ్మ అజ్ఞానులు అంటారు. ఎప్పుడైతే మనకు లేనిది పొందుతామో ఆ పొందింది కలిగి ఉంటాము. అజ్ఞ్యానం అనేది చీకటి అనుకుంటే జ్ఞానమనే వెలుతురూ ఎప్పుడైతే వస్తుందో అక్కడ అజ్ఞానం అనే తిమిరం పారద్రోలపడుతుంది. తద్వారా జ్ఞానం కలుగుతుంది.  ఇట్లా అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టే వాడే గురువు. 
సాధారణ మానవులు జ్ఞానం అనేది ఈ జగత్తులోనే వున్నదని తానూ చూస్తూవున్న జగత్తులో జ్ఞానాన్ని వెతుకుతారు. నిజానికి ఆ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం కాదు కేవలం ఇంద్రియ గోచరమైన జ్ఞానం ఇది అసంపూర్ణం .  ఎందుకంటె ఎవరైతే ఒక విషయం గూర్చి జ్ఞానం పొందుతారో దానికన్నా ఆ విషయం లో ఎక్కువ జ్ఞానం పొందిన ఇంకొకరు వానికి తారస పడ్డప్పుడు తాను పొందిన జ్ఞానం కొంతవరకే అనేది తెలుసుకుంటారు. ఈ ప్రపంచంలో ఏ ఒక్క మానవుడు కూడా ఏ ఒక్క విషయంలోకూడా పరిపూర్ణుడు కాజాలడు కేవలం తానూ కొంత విషయజ్ఞనం మాత్రమే కలిగి ఉంటాడు అన్నది మాత్రం యదార్ధం. 
బ్రహ్మ జ్ఞ్యానం కేవలం సాద్గురువు ద్వారానే పొందగలరు.
సత్యాన్వేషణలో భార్గవ శర్మ 

17, మే 2020, ఆదివారం

దేవాలయాలలో దేముడు ఉంటాడా?

దేవాలయాలలో దేముడు ఉంటాడా? దేవాలయంలోని విగ్రహంలో దేముడు వున్నాడని మనమందరము గుడికి వెళ్లి విగ్రహాన్ని మొక్కు తున్నాము. ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ఏమంటే విగ్రహం రాతితో చేసిందే, అదే విధంగా గుడి మొత్తం రాతితో చేసిందే ఐతే విగ్రహం దేముడు ఎలా ఐయ్యాడు, గుడి మెట్లు దేముడు ఎందుకు కాలేదు.  ఈ ప్రశ్నకు చాలామంది సమాధానం చెప్పలేక పోటంతో హిందువులకు మన ఆచారాలమీద, సాంప్రదాయాలమీద నమ్మకం సన్నగిల్లుతుంది.
ప్రతి దానిని కూలంకుషంగా పరిశీలిస్తే మనకు ప్రతి హిందూ విధానానికి సమాధానం తెలుస్తుంది.
మీకు ఈ విషయాన్నీ మీకు తెలిసిన ఉపమానంతోటే వివరిస్తాను.  ఈ రోజు మనందరికీ ఫోన్ అంటే తెలియనివారు లేరు, అంతే కాక ఫోన్ వాడనివారు లేరు. కాబట్టి మీకు ఫోనునె  ఉదాహరణగా తీసుకొని ఈ విషయాన్ని వివరిస్తాను.
మనం ఫోన్ చేసిన వారు పెద్దవారు ఐతే ఫోనులో గౌరవంగా నమస్కారం చేసి వినయంగా మాట్లాడుతాము అదే చిన్న వాళ్ళు ఐతే ప్రేమతో మాట్లాడుతాము.  అలాగే మనం ఎవరితో మాట్లాడితే వారు మన ముందరవుంటే ఏరకంగా ప్రవత్తిస్తామో అలానే ప్రవర్తిస్తాము.  నిజానికి మనం మాట్లాడేది ఫోనుతో కాని  అవతలి వ్యక్తితో కాదు.  ఈ విషయం మనందరికీ  తెలుసు. కానీ మనం మాట్లాడిన మాటలు అవతలి వాడు వింటున్నాడని మనకు నమ్మకం.  దానికి ప్రమాణం అవతలి వ్యక్తి నీతో ఫోనులో మాట్లాడటమే. నిజానికి నీ చేతిలో వున్న ఫోన్కి అవతలి వ్యక్తికీ ఎలాంటి సంబంధం లేదు. కానీ మీ ఇద్దరికీ ఫోన్ సంబంధాన్ని కలుపుతున్నది.  అంటే ఫోన్ ఒక సాధనగా మీ మధ్య వున్నది.  మీరు ఒకరికి ఒకరు ఎదురుపడితే ఫోన్లో మాట్లాడుకొనవసరం లేదు.  ఇప్పుడు ఫోన్ నిర్మాణాన్ని పరిశీలిద్దాం.  ఫోన్ ఒక ప్లాస్టిక్ పదార్ధంతో కొన్ని లోహపు తీగలతో మరియు  ఇతర ఎలక్ట్రానిక్ I.C.లతో నిర్మితమైనది.  నీ ఫోనులో వున్న వస్తువులు విడిగా బైట కూడా దొరుకుతాయి కానీ అవి విడివిడిగా ఫోన్ చేసే పని చేయలేవు.  ఆ విడిభాగాలను ఒక సర్క్యూట్ ప్రకారం అమర్చి షోల్డర్స్ చేసి నిర్మించితేనే ఫోన్ తయారు అవుతుంది.  అంతేకాదు ఫోనుకు ఒక సిం కార్డుకూడా ఉండాలి అప్పుడు అది పలుకుతుంది.  ఈ విషయం మనందరికీ తెలిసిందే.
ఇప్పుడు మన హిందు దేవాలయాన్ని ఫోనుతో పోలుద్దాం. దేవాలయం ఒక ప్రత్యేక నిర్మాణం అది ఆగమశాస్త్ర విధానంలో నిర్మిస్తారు.  మానవులు నివసించే గృహాలకి దేవాలయ నిర్మాణానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. గర్భగుడి నిర్మాణం చాలా ప్రత్యేకత కలిగి ఉంటుంది.  ఈ నిర్మాణానికి గోపురం ప్రముఖమైనది.  గోపురం కొనికల్ ఆకారంలో వుంది చాలా ఎత్తుగా ఉంటుంది.  దాని మధ్య భాగంలో విగ్రహం ప్రతిష్టిస్తారు.  ఆ విగ్రహంపై ఆకాశంలోని కాస్మిక్ శక్తి పూర్తిగా గోపురంద్వారా ప్రసరించి కేంద్రీకరించబడుతుంది.  కాబట్టి ఎప్పుడైతే భక్తుడు ఆ విగ్రహాన్ని దర్శిస్తాడో విగ్రహంలో వున్న కాస్మిక్ ఎనర్జీ భక్తునిపై రిఫ్లెక్ట్ అవుతుంది.  దత్ ద్వారా భక్తునికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక మన ఫోనులో ఉన్నట్లు సిం కార్డు దేవాలయంలోకూడా ఉంటుంది.  దీనినే యంత్రం అంటారు.  ఈ యంత్రం ఆగమశాస్త్ర రీత్యా స్వర్ణ, రజిత, తామ్ర ఫలకాలలో ఏదో ఒక ఫలకం మీద నిర్మించి విగ్రహ ప్రతిష్ట సమయంలో తగు విధంగా పూజించి విగ్రహం క్రింద ప్రతిష్టిస్తారు.  ఆ యంత్రం భక్తునికి భగవంతునికి మధ్య మీ ఫోను కనక్క్షన్ మాదిరి పనిచేస్తుంది.  భక్తుని కోరికలు భగవంతునికి చేరి ఈ విగ్రహం ద్వారా భక్తుని కోరికలు ఈడేరుతాయి. అందుకే భక్తులు అనేక వందల కిలోమీటర్ల దూరమునుండి వచ్చి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు.  ప్రసిద్ధ దేవాలయాలకు భక్తుల రద్దీ రోజు మనం చూస్తున్నాం.
పూజించటం ఎలా. షొడశోపచార పూజ అంటే ఏమిటి మళ్ళి ఇంకోసారి తెలుసుకుందాం.
సనాతన హిందూ ధర్మంలో పూర్వం ప్రజలు పెద్దవాళ్ళు చెప్పింది ఎదురు ప్రశ్న వేయకుండా అనుకరించేవారు.  అందుకే వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు మన గ్రహచారం ఏమంటే చాలామంది హిందువులకు హిందూ ధర్మం మీద అవగాహన లేదు.  అది అటుంచి ఇతరులు హిందువులఫై దాడి చేయటానికి వాళ్ళకి తెలిసింది కొంత తెలియనిది కొంత పైత్యం కలిపి ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తున్నారు.  అది అట్లా ఉంటే కొందరు హిందువులు నాస్తికులుగా మారి హిందూ ధర్మాన్నే ప్రశ్నిస్తున్నారు.  ఇది చాలా విచారించదగ్గ విషయం. అందుకే ప్రతి వారికి హిదు  సంప్రదాయాల విశిష్టత తెలియ చేయాలనే ఉద్దేశంతో ఈ రచనలు సాగిస్తున్నాను.  బుధ జనులు ఈ వివరణలను పరికించి, పరిశీలించి, చేసే సాద్ విమర్శలకు సాదర స్వగతం. వితండ వాదం చేసేవారి విమర్శలు నిషేధం. 

7, మే 2020, గురువారం

మందు బాబు మందు



భార్య రోదన కర్ణ పుటలకు చేరటంలేదు,
పిల్లల ఆక్రోధన మనసుని తాకటం లేదు
ఇంట్లో సరుకులు లేవనే బాధ లేదు,
ఎవరేమనుకుంటారన్న ఆలోచన లేదు
మండల కాలం ఉగ్గపట్టుకొని వున్న
మందు బాబులు బాటిళ్లకోసం బారులుతీరారు
నగర జనులు పరిహసిస్తున్నకాని


6, మే 2020, బుధవారం

తాగండి తూలండి తగిలించుకోండి

   ఆ. ప్ర. లో మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.  అంతే కాదు అక్కడ ఎలాంటి సామజిక దూరం పాటించకుండా ఒకరిమీద ఒకరుగా వుంటూ ఇన్నాళ్లు ఎదురుచూసిన మధురసం పొందటానికి పోటీ పడ్డారు.  ఇది ప్రత్యక్షంగా ప్రతి టి.వి. చానలు చూపించింది.  ఇక కరోనాకు కళ్లెం వేయటం కుదరదు అని అనుకున్నాము.   తెలంగాణలోకూడా సారా పిపాసులకు స్వగతం పలుకుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం శోచనీయం. దేశంలోనే మన రాష్ట్రం కరోనా కట్టడిలో కఠినంగా వర్తిస్తు చాలా వరకు కరోనాను కట్టడి చేసాము అన్న ముఖ్యమంత్రి గారికి మరి సారా తెరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదా అని అనేక వర్గాలు ఉటంకిస్తున్నాయ్.

ఈ పరిస్థితి చుస్తే సారా బాబులు మీరు ఎక్కడికో వెళ్లి తాగక్కరలేదు.  చక్కగా ఇక్కడే తాగండి   తూలండి కరోనాను తగిలించుకోండి మీ కుటుంబాన్ని మీ కాలనీకి  అంటించండి మీకు పూర్తీ స్వేచ్ఛ వుంది.  అని అనాలనిపిస్తుంది. 
ఇక్కడ ఎంతో కట్టుదిట్టం చేస్తేకూడా అటు రాజకీయ నాయకులూ ఇటు కొందరు వున్మాదులు, వారి వారి అధికారాల్ని, మూర్ఖత్వాన్ని చూపుతూ పోలీసులపై, డాక్టర్ల ఫై దాడికి దిగుతున్నారని రోజు మనం ట్.విలో చూస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం డాక్టర్లమీద, ఇతర ఆరోగ్య సిబ్బందిమీద దాడి చేసే వారిమీద కఠిన చెర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని తెస్తే ఎన్ని కేసులు పెట్టారు అన్నది శోచనీయం. చదువుకున్న, సంస్కారమున్న, అధికారమున్న వారే ఆలా ప్రవర్తిస్తే ఇక చదువు సంధ్య లేని తాగుబోతుల్ని ఆపటం సాధ్యమా. ఈ విషయాన్నీ ప్రభుత్వం గుర్తించాలి. 

దేముడే అన్ని చూసుకుంటాడు. మనకేం కాదని మెట్ట వేదాంతం వల్లిద్దామా. ఆలోచించండి. 

ఇక మనం చేసిది ఏమిలేదు మధుపాన ప్రియో జ్ఞానీ భవ, మధుపాన ప్రియా సంస్కార భావ, మధుపాన ప్రియా ఆరోగ్య భవ  అని కోరుకోటం తప్ప 

సర్వే జానా సుఖినోభవంతు. 
సర్వ సంతు ఆరోగ్య భవతు. 
ఓం శాంతి శాంతి శాంతిః  

5, మే 2020, మంగళవారం

మందు బాబులు కరొనను వ్యాప్తి చేయరా?

ఈ రోజు ఏ T.V చూసినా ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాలగూర్చి చర్చిస్తున్నారు.  రాష్ట్ర ప్రబుత్వం మద్యం దుకాణాలను తెరవటం అటు మహిళలోకంలో కల కలం రేకెత్తిస్తుంది.  చాల మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు మద్యానికి అలవాటు పడ్డ వారు ఈ కరోనా పుణ్యమా అని మద్యానికి దూరంగా వున్నారు.  ఇది ఇంట్లో వున్న మహిళలకు ఆనందంగా వుంది. రోజు కూలి చేసుకొనే వారు రోజు ఏదో ఒక చిన్నా చితక వ్యాపారాలు చేసుకొనే వారు మద్యం జోలికి పోకుండా ఉండటంతో వారి వద్ద వున్న డబ్బులు సురక్షితంగా ఉన్నాయని ఇంట్లో ఆడవారు అనుకునే ఆశలు అడియాసలే అయ్యాయి వారి ఆనందం నిప్పుల మీద నీళ్లు పోసినట్లుగా ఈ మద్యం దుకాణాల తెరువు అయ్యిన్ది. దానికి తోడు ఇన్నాళ్ల సారా ఆదాయం పూడ్చుకోటానికా అన్నట్లు ఇప్పుడు మద్యం రేటు 75% పెంపు చేశారన్నది బట్ట తలమీద తాటి కాయ పడ్డట్లు అయ్యిన్ది.  మద్యం రుచి చూడక ఇన్నాళ్లు ఆగిన సారా రాయుళ్లు యెంత ధరైనా పెట్టి తాగాలని కుతూహలపడటంలో తప్పు లేదు. సారా వ్యసనానికి అలవాటు పడ్డవారు వారి కుటుంబ పరిస్థితులు వారి ఆదాయ వ్యయ నిబద్దత కలిగి వుండరు. కాబట్టి వారు ఇంట్లో భార్య నగలు (ఉంటే) అమ్మి అయినా తాగటానికి వెనుకాడరు.  ఇట్లా యెంతోమంది  తమ కుటుంబాలను రోడ్డుపైకి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది.  కాబట్టి ఈ విషయాన్నీ పరిగణలోకి తీసుకొనైనా ప్రజల ప్రాణాలను కాపాడే దిశలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాలని వెంటనే మూసివేస్తే చాల మంచిది.  ఇప్పుడు ఆంధ్రప్రదేషులో కొరోనా విష కోరలు చాపి విజృంబిస్తున్నది.  ఈ తరుణంలో సామాజిక దూరం పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా జనాలు ఎండలో వచ్చి సారా కొనుక్కని అటు వాళ్ళ కుటుంబం ఇటు సమాజానికి హాని కలుగ చేస్తారటంలో అతిశయోక్తి లేదు.  మందు బాబులకు ఒక్కరికి కరోనా సోకినా అది విజృంభించి ఎంతో మంది ప్రాణాలను బలికొంటుందనటం నిజం. 
ఏ రకంగా చుసిన ఈ మద్యపు దుకాణాల తెరపు మాత్రం సభ్య సమాజం హర్షించదగ్గ విషయం కాదు. 
ప్రభుత్వం మరలా అలోచించి వెంటనే మద్యం షాపులు మూయాలని ప్రజలంతా కోరుతున్నారు.  
లిక్కర్ ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే ఒక మంచి వనరు కాదని ఎవ్వరు అనరు.  కానీ ప్రజలప్రాణాలు బలిపెట్టి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవటం యెంత వరకు సమంజసం.  యేది ఏమైనా ఈ సమయంలో  మద్యం దుకాణాలు తెరవటం కరొనాను  తలుపులు తెరచి ఆహ్వానించటం కన్నా వేరు కాదు. 
ఈ విషయంలో మన ప్రియతమ ప్రధాన మంత్రిగారు తక్షణం దేశాన్ని కరోనానుంచి కాపాడే క్రమంలో  దేశం మొత్తంలో మద్యం దుకాణాలను పూర్తిగా కరోనా సమసిపోయే వరకు తెరవకూడదని తెరిస్తే కఠిన శిక్షలు విధిస్తామని ఆర్డినెన్సు తేవాలి. 
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని చూసి తెలంగాణ ప్రభుత్వం కుడా మద్యం షాపులు తెరిచే ప్రయత్నం చేస్తే ఆశ్చర్య పడ నవసరం లేదు. 
ఇప్పటికైనా మద్యం దుకాణాలను మూయకపోతే కరోనాను నియంత్రిచటం మన దేశంలో ఎవ్వరి వల్ల కాదు. 
జనాలను చంపి స్మశానముమీద పరిపాలన చేయాలనుకుంటే మాత్రమే మద్యం దుకాణాలను ఇంకా ఇంకా తెరచి, ఇంకా కొత్తవి పెట్టి ఆదాయం పెంచుకోండి అని సామాన్య మహిళలు అంటున్నారు.  

ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి కానీ ప్రజలతో వ్యాపారం చేసే దిశలో పని చేయకూడదు. మందు బాబులతో కరోనా వ్యాప్తి చెందదు అని ఏమైనా ఉన్నదా, లేదే కరోనాకు జాతి, మత, కుల, వర్ణ, లింగ బేధం లేదని మనం చూడటం లేదా? 
ఈ విపత్కర పరిస్థితిలో మద్యం షాపులు తెరవటం సమంజసం కాదని మేధావి వర్గం వేనోళ్ల వక్కాణిస్తున్నది. అంతే కాదు ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన మన ఆంధ్రప్రదేశ్ మరో ఇటలీ కాగలదు. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. 

మహిళలకు విజ్ఞప్తి; అమ్మలారా, అక్కలారా మీరు మీ భర్తలను ఇంటినుండి బైటికి వెళ్లనీయకుండా కట్టడి చేయండి.  మీ మీ భర్తలను సారానుండి కాపాడుకోండి తద్వారా మానవ సమాజాన్ని కాపాడండి. 

సర్వ్ జానా సుఖినోభవంతు. 
ఓం శాంతి శాంతి శాంతిః