మీకు తెలుసా?
ఇది కేవలం HP గ్యాస్ వినియోగదారులను ఉద్దేశించి వ్రాసింది.
2018 వ సంవత్సరంలో HP గ్యాసు కంపెనీ వారు వినియోగదారుల సఔకర్యార్దం EZY GAS Card ను ప్రెవేశపెట్టారు. మనందరికీ కూడా ఆ కార్డులు అంద చేశారు. కంపెనీ వారు 24 రూపాయలకు ఆ కార్డు విక్రయించారు. కానీ మనకు మన డెలివరీ బోయలు అంతకంటే ఎక్కువ ధరకు (నేను 30 చెల్లించను) మనకు అందచేశారు. అప్పుడు మనతో మీరు ఈ కార్డుతో గ్యాసు సిలండరు కొనవచ్చని చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను డెలివరీ బోయిని ఆ కార్డు గూర్చి అడిగితె మాకు స్వీప్ మిషన్లు ఇవ్వలేదని చెపుతున్నారు. మీలో ఎవరైనా ఆ కార్డు వినియోగించారా అయితే తెలుపగలరు. కాగా ఈ విషయంలో నేను నెట్లో వెతికితే 23rd April 2018 నాటి ఇండియన్ ఎక్సప్రెస్ పేపరు లో దానికి సంబందించిన కధనం కనపడింది. మీరు క్రింది లింకుని క్లిక్ చేసి చదువగలరు
https://www.newindianexpress.com/cities/hyderabad/2018/apr/23/ezy-gas-cards-not-making-things-easy-for-lpg-customers-in-city-1805132.html
ఆ కధనం ప్రకారం HP గ్యాసు కంపెనీ వారు డెలివరీ బాయ్ వసూళ్లను అరికట్ట టానికి మరియు బ్లాకులో సీలిండర్లు అమ్మటానికి నిషేదించటానికి ఈ కొత్త విధానం ప్రవేశ పెట్టినట్లు పేర్కొన్నారు. మరి నిజంగా వినియోగదారుల మీద ఇంత శ్రర్ధ ఉంటే ఇప్పటి దాకా స్వైపు మిషన్లు డెలివరీ బాయ్ లకు ఎందుకు ఇవ్వలేదు. లేక కంపెనీ ఇచ్చినా డెలివరీ బాయ్ వాటిని తీసుకొని రావటం లేదా ఇది ఎవరికి తెలియని విషయం.
డెలివరీ బాయ్ సిలిండర్ దర మీద దాదాపు 30 రూపాయల దాకా ఎక్కువ వాసులు చేస్తూ ఉండటం మన అనుభవం కాదని ఎవరైనా అనగలరా.
ఇప్పుడు మనకు HP గ్యాసు మరియు HP pay అనే రెండు క్రొత్త apps వచ్చాయి వాటితో మనం గ్యాసు book చేయవచ్చు మరియు మన account నుండి నేరుగా సిలిండర్ ధరను చెల్లించ వచ్చు.
మీలో ఎవరైనా ఈ విధంగా చిల్లిస్తుంటే తెలుపగలలరు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి