19, జూన్ 2022, ఆదివారం

కొంగు చాటు బాలుడు

 కొంగు చాటు బాలుడు. 

బాల్యంలో పిల్లలు తోటి పిల్లలతో ఆడుకుంటూ ఏదైనా స్పర్ధవస్తే తోటివాడు కొట్టటానికి వస్తే వెంటనే ఆ ప్రక్కనే వున్న అమ్మ కొంగుచాటున దాక్కోవటం సర్వసాధారణం.  ఒక్కసారి గతంలోకి వెళ్లి చుస్తే ఈ సంఘటన ప్రతిమనిషి జీవితంలో ఎప్పుడో ఒక్కప్పుడు జరిగివుంటుంది.  కొంగు చాటున వున్న పిల్లాడిని ఎదుర్కోవటం తోటి బలులకు ఎంతమాత్రం సాధ్యం  కాదు. వాడు తరువాత దొరికితే ఆ పిల్లవానిని అరె వీడు ఒట్టి పిరికివాడురా ఎదురు నిలువలేక వాళ్ళ అమ్మ కొంగు వెనకాల దాకుంటాడురా అని ఆటపట్టియటం సర్వ సాధారణం. ఇక విషయానికి వస్తే 

ప్రతి బ్రాహ్మడు  కూడా కొంగుచాటు పిల్లవాడే కొంగుచాటున వున్న బ్రహ్మనుడిని ఎవ్వరు ఏమిచేయలేరు. మరి వాళ్ళు ఏతల్లి కొంగుచాటు పిల్లలు అంటే సాక్షాత్తు జగన్మాత అయిన గాయిత్రి మాత కొంగుచాటు పిల్లలు. ఏ బ్రాహ్మణుడైతే నిత్యం గాయత్రి జపం దీక్షతో, శ్రద్ధతో, త్రికరణ శుద్దితో నియమానుసారం క్రమశిక్షణతో, ఆచరిస్తాడో ఆ బ్రాహ్మణని ఆ గాయత్రీ మాత సదా వెన్నంటివుండి కాపాడుతుంది.  గాయత్రి జపం చేసే బ్రాహ్మడికి  ఎట్టి పరిస్థితిలోను, ఈతిబాధలు కలుగవు, పేదరికం దరిదాపుల్లో ఉండదు, కుటుంబం సుభిక్షంగా ఉంటుంది, కుటుంబ సంబందాలు సదా ప్రేమమయంగా, సంతోషంగా  ఉంటాయి, ముఖం సదా బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లుతుంది, శరీరం శోభాయమానంగా ఉంటుంది, రోగాలు దరిచేరవు. వాక్కు అమృతతుల్యంగా మారుతుంది.  వాని మాటలు వేదవాక్కుగా పనిచేస్తాయి.,  ఆచరించే కర్మలు సదా సత్కర్మలే అవుతాయి. రుణబాధలు వుండవు.  తిండికి లోటుండదు. ఆ బహ్మడు సదా పలువురితో పూజింపబడతాడు.  అందరు అతనిని ఉన్నతునిగా  చూస్తారు. ప్రతివారు అతనిని ఇష్టపడతారు. తాను ఎట్టి పరిస్థితిలోను దుష్కర్మలు చేయడు ఎందుకంటె ఆ గాయత్రీమాత సదా వాని హృదయంలో ఉండి అతని జీవితానికి దిశా నిర్దేశనం చేస్తుంది. 

గాయంతం త్రాయతే ఇతి గాయత్రి.గాయంతం అంటే గానం చేయడం,పాడడం.గాయత్రి మంత్రాన్ని నిత్యం గానం చేసే వారిని రక్షించేది గాయత్రి మాత  అని అర్దం.
గాయత్రి చంధసాం మాత.అంటే అన్ని మంత్రాలకు తల్లి గాయత్రి.అని భావం
తద్యత్ ప్రాణం త్రాయతే తస్మాద్, గాయత్రి., ప్రాణాలను రక్షించేది గాయత్రి అని అర్దం.

గాయత్రి వేదమాత.గాయత్రి మంత్రానికున్న శక్తి అపారమైనది, వర్ణించలేనిది. జ్ఞాపక శక్తిని పెంచి తీరుతుంది.24 అక్షరాల ఈ మహా మంత్రానికి 32 మంది అధిదేవతలున్నారు.ఈ మంత్రాన్ని రక్షించేవారు. శివుడు, విష్ణువు, బ్రహ్మ, నరసింహుడు, ఇంద్రుడు, సూర్యుడు..... ఇలా. ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఇంతమంది దేవతలు  మన నిత్య జీవితంలో ఏదురయ్యే కష్టాలను తొలగించుతారు.  అంతేకాదు  32 దేవతలను స్మరించిన ఫలితం వస్తుంది.

అందుకే "గాయత్రి పరమో మంత్రః"అన్నారు.అంటే గాయత్రికి మించిన మంత్రం లేదు అని.అర్ధం 

గాయత్రి మంత్రం మీద జరుగినవి,జరుగుతున్న పరిశోధనలు మరే మంత్రం మీద కాని,ఇతర మతాల్లోని ఏ అంశం మీద గాని జరగట్లేదంటే అతిశయొక్తి కాదు.గాయత్రి మంత్రాన్ని నియమంగా, పట్టుదలతో, శాస్త్రం చెప్పిన రీతిలో,సరైన స్వరంతో చేస్తే సౌరశక్తికి 1లక్ష రెట్ల శక్తి జపించేవారికి కలుగుతుందని పరిశోధకులు చెప్పారు.

ఈ మంత్రంలో ఉన్న 24 అక్షరాలు మన శరీరంలో ఉన్న 72000 నాడులను ప్రేరేపిస్తాయని,మన ముఖ భాగంలోని కదలికలతో మన శరీరంలో ఉన్న 6 చక్రాలను ప్రభావితం చేసి కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది.శోచనీయయిన విషయం ఏమిటంటే ఈ రోజు గాయత్రి మంత్రం యెక్క శక్తిగూర్చి విదేశీయులు పరిశోధనలు చేస్తుంటే మనదేశంలో పుట్టి పెరిగిన బ్రాహ్మణ్యం గాయత్రి మాతను వదలి విదేశీ వ్యామోహంలో పడి వారి ఉనికికే ముప్పు తెచుకుంటున్నారు.  కాబట్టి మిత్రమా ఈ రోజు నీకు ఆ భగవంతుండు బ్రాహ్మణ జన్మ ఇచ్చాడు అంటే అది నీవు ఎన్నోజన్మలలో చేసుకున్న మంచి ప్రారబ్ధ ఫలం.  ఈ జన్మను నిరర్ధకం చేసుకోకు. సదా నియమనిష్టలతో నీ జీవితాన్ని మలచుకొని మోక్షప్రాప్తికి కృషిచేయి. 

మన సాంప్రదాయాలను గౌరవిద్దాం మరియు ఆచరిద్దాం. పంచ కట్టుకోవటం వెనకపడిన తనం కాదు అది మిమ్ములను ఆధ్యాత్మిక మార్గంలో పయనించటానికి ఏర్పరచిన ఒక చక్కటి వస్త్రధారణ, శిఖదారణ చేయటం మూర్ఖత్వం కాదు ప్రతి బ్రాహ్మడు విధిగా శిఖ కలిగి ఉండటం ఆవశ్యకం.  శిఖ లేకుండా ఆచరించే ఏ క్రతువు కూడా ఫలితాలను ఇవ్వదు.  మన దురదృష్టం ఏమిటంటే కేవలం పితృ కర్మలను ఆచరించేటప్పుడే శిఖ ధరించటం ఆనవాయతీగా అనుకుంటున్నాము.  కానీ మిత్రమా శిఖ లేకుండా నీవు సంధ్యావందనం చేయటానికి కూడా అయోగ్యుడవే అది తెలుసుకో. పౌరోహితం చేసే బ్రాహ్మణోత్తములు ఈ విషయం ప్రతి బ్రాహ్మణుడికి తెలపాల్సిన అవసరం వున్నది.  ముందుగా వారు ఆచరించాల్సిన వీధికుడా వున్నది. . ఎలాంటి కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాలు చేకూరుతాయి అన్నది మన మహర్షులు శోధించి సాధించి మనకు ఒక చక్కటి జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు.  కేవలం మనం వారిని అనుసరించి,  వాటిని ఆచరించి తరించటమే మన కర్తవ్యము. కాబట్టి మిత్రమా ఇప్పుడే మేల్కొని గాయత్రి మాత అనుగ్రహాన్ని పొందే విధంగా నీ జీవన సరళిని మార్చుకొని సత్ బ్రాహ్మణుడిగా మారటానికి ఉద్యుక్తుడివి కమ్ము.  నీ గమ్యాన్ని చేరుకునే దిశలో పయనించు సదా గాయత్రి తల్లి మనకు అండగా వుంటూ రక్షిస్తుంది. 


ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః 

సదా బ్రాహ్మణోద్దారణకు పాటు పడ సంకల్పితుడు 

మీ భార్గవ శర్మ

శిఖ లేని బ్రాహ్మడు బ్రహ్మ్మడే కాదు 

 




1 కామెంట్‌:

NAGESWARA RAO TURAGA చెప్పారు...

మీరు వ్రాసిన ప్రతి అక్షరం నిత్యసత్యమైనది. సదా ఆచరించతగ్గది. సమస్త సన్మాంగళాని భవన్తుః