19, జూన్ 2022, ఆదివారం

దక్షిణావర్తి శంఖం

 దక్షిణావర్తి శంఖం యొక్క ప్రత్యేకత - 2 . 


      అంతకు ముందు పోస్టు నందు మీకు దక్షిణావర్తి శంఖం గురించి మీకు వివరించాను . ఇప్పుడు మీకు దక్షిణావర్తి శంఖం యొక్క పూజావిధానం వివరిస్తాను . 


     ఎటువంటి అవలక్షణాలు లేనటువంటి దక్షిణావర్తి శంఖమును సేకరించుకుని ముందుగానే కర్రతో చేసిన ఆసనము పైన ఒక ఎర్రని కొత్త గుడ్డని పరచి దానిపై శంఖువు యొక్క శిఖరం తూర్పు ,ఉత్తర ఈశాన్యం వైపు ఉంచాలి. ఇలా పెట్టడానికి ముందుగా కొన్నిరకాల స్నానాలు చేయించాలి . మొదట శుద్ధోదక స్నానం అనగా శుభ్రమైన నీటితో స్నానం తరువాత పంచామృత స్నానం ( తేనె , ఆవుపాలు , ఆవుపెరుగు , ఆవునెయ్యి , బెల్లం పంచామృతాలు .బెల్లం లేనప్పుడు పంచదార వాడవచ్చు .)  అటుపిమ్మట ఫలోదక స్నానం అనగా కొబ్బరి , బత్తాయి , నారింజ మొదలైన ఫలరసాలతో స్నానం చివరగా మరొక్కసారి శుద్ధోదక స్నానం చేయించాలి . 


                శుద్ధోధక స్నానం అయిన తరువాత శంఖానికి బొట్టుపెట్టి పసుపు , గంధములు మిశ్రమములు లేపనం చేసి ఆసనం పైన కూర్చుండబెట్టిన తరువాత ధూపదీపాలను సమర్పించాలి . అగరుబత్తి ధూపముతో పాటు సాంబ్రాణి ధూపము కూడా వేయవలెను . తరువాత పుష్పాలతో  అర్చిస్తూ క్రింద చెప్పబోవు మంత్రమును 1116 సార్లు ఉచ్చరించాలి . 


 మంత్రం  - 


 ఓం శ్రీo దక్షణావర్తి శంఖాయ నమః . 


       ఇక్కడ ముఖ్యముగా మరొక్క విషయాన్ని గుర్తు ఉంచుకొనవలెను . శంఖపూజ చేయుటకు మునుపు గణపతి పూజ చేయవలెను . హోమాము చేయించే ఓపిక ఉన్నవారు కనీసం 1116 సార్లు మంత్రోచ్ఛారణతో హోమము చేయించి ఆ హోమగుండము నందలి విభూధిని శంఖానికి మొత్తం లేపనం చేసి ఆ తరువాత శంఖాన్ని పూజాస్థలము నందు పెట్టుకోవాలి . నైవేద్యం ఏదైనా తియ్యని వస్తువును సమర్పించవచ్చు . ఓపిక ఉన్నవారు శ్రీమహాలక్ష్మి సహస్త్ర నామార్చన చేయించుట మంచిది . 


  దక్షిణవర్తి గృహము నందు ఉండటం వలన కలిగేడు శుభాలు  - 


 *  ఈ శంఖువు యే గృహము నందు ఉండునో ఆగృహము నందు దరిద్రం అనే మాట వినిపించదు . 


 *  గృహములో ఎక్కడ ఉంచితే అక్కడ అభివృద్ధి కనపడును . 


 *  అన్నగృహములో అన్నవృద్ధి , లాకర్లు , అలమారాలు వాటిలో ధనవృద్ధి , పూజగది యందు ఉంచిన సమస్త సంపదల వృద్ది జరుగును . 


 *  దీని యందు గంగాజలం నింపి చల్లిన బ్రహ్మహత్యాది పాపాలు నశించును . సమస్త వస్తువులు , గృహము అంతా చల్లిన అన్ని రకాల దోషాలు పోవును భూతప్రేత , పిశాచ బాధ తప్పును . 


 *  నెగిటివ్ శక్తి నశించును . 


      పైన చెప్పిన ఫలితాలు సంపూర్ణముగా సిద్ధించాలి అంటే దోషములు లేనటువంటి శంఖువు సేకరించి శాస్త్రోక్తముగా పూజ జరిపించి గృహము నందు ఉంచుకొనవలెను . 


  దోషములు గురించి వివరణ - 


   *  పగిలినది , విరిగినది , ముక్క ఊడినది పనికిరాదు . 


 *  శంఖు పైభాగములో గరుకుగరుకుగా ఉండరాదు . 


 *  మచ్చలు , లోపలికి అణిగి ఉండునట్లు గుంతలుగా ఉండరాదు . 


 *  శంఖువు యొక్క శిఖరము మరియు తోక భాగము రెండుగా చీలడం గాని విరిగిగాని ఉండరాదు . 


       శంఖువు తెలుపు రంగుతో ఉన్న సర్వశ్రేష్ఠం . అలా కానప్పుడు పసుపు చిన్న ఎరుపు రంగుల మిశ్రమముతో ఉన్న కొంత పరవాలేదు . ఈ శంఖువు పుజ చేయుటకు గురువారం పుష్యమి నక్షత్రం , ఆదివారం పుష్యమి నక్షత్రంతో ఉన్న రోజు చాలా మంచిది . ఈ సమయాన్ని "పుష్యార్క యోగము " అని అందురు . లేకున్న విజయదశమి రోజు , కార్తీక పౌర్ణమి రోజు , మకరసంక్రాంతి రోజు పూజ జరిపించుటకు ఉత్తమమైన దినములు .  


       పైన చెప్పిన సమయములు దగ్గరలో లేకున్న రేవతి , విశాఖ , పుష్యమి , శ్రవణం , రోహిణి నక్షత్రాలు బుధ , గురు , శుక్రవారాలలో కలిసినవి సంభవిస్తే ఆ సమయాలలో పూజ  చెయవలెను . ఆయా గ్రహాల సహస్రనామాలతో పూజ చేయుట చాలా మంచిది . 


                        సమాప్తం   


            మరిన్ని అతి సులభ యోగాల కొరకు నా గ్రంథాలను చదవగలరు.


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

కామెంట్‌లు లేవు: