🍀🌺🍀
*అదృష్ట వంతులు మాత్రమే చదవగలరు!*
*విజయం అంటే ఏమిటి?*
➖➖➖✍️
*మన దేశం నుండి ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీ లో విద్యార్థులతో మాట్లాడుతూ…. “విజయం అంటే ఏమిటి?” అని అడిగితే ఒక యువతి “విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం!”అన్నది.*
*అపుడు ఆ ప్రొఫెసర్ “అయితే ఇరవైఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో చెప్పండి?” అంటే ఎవరూ చెప్పలేదు.*
* [ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి]*
*బ్రతకడానికి కొంత డబ్బు కావాలి కానీ , డబ్బే బ్రతుకు కాదు! అంటే విజయమంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట.*
*మరో యువకుడు లేచి “విజయం అంటే బలం / శక్తి” అన్నాడు.*
*అలా అయితే అలెగ్జాండర్ , నెపోలియన్, ముస్సొలిని, హిట్లర్ , స్టాలిన్ , బిన్ లాడెన్ ... వీళ్ళంతా బలవంతులు, ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా, వీళ్ళు జీవితం లో సంతోషంగా వుండగలిగారా ? వీళ్ళ జీవితాలు ఎలా గడిచి , ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా ! తన బలంతో , తన ముష్టిఘాతాలతో మహా బలవంతులను మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ చాంపియన్ బాక్సర్ , తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల కాఫీకప్పును కూడా పట్టుకోలేక పోయాడు. అయితే విజయమంటే బలం / శక్తి సంపాదన కాదు అన్నమాట.*
*మరో యువతి “విజయమంటే ప్రఖ్యాతి, అందం!” అంది. అయితే కేట్ మోస్ , జీన్ ష్రింప్టన్ , సోఫియాలారెన్ , మార్లిన్ మన్రో ...లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు. భారత్ విషయానికొస్తే , పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే , అమితాబ్ బచ్చన్ తో సహా , ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకొనని హిందీ సినిమా హీరో నే లేడు. డానీ, కబీర్ బేడీ , మహేష్ భట్ లతో ఆమె ప్రేమ , పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర , రాజేష్ ఖన్నా , అమితాబ్ బచ్చన్ .. ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే. కొద్దిరోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి , నమ్మిన వాళ్ళు మోసం చేస్తే , తాగుడుకు బానిస అయ్యి , ఒక దశలో కాలికి కురుపు లేచి , అది ఒళ్ళంతా ప్రాకి , ఏ శరీరం కోసం అయితే అంతమంది మగ వాళ్ళు పిచ్చిక్కెపోయారో , అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే , ఆమెకు ఏదో వింతవ్యాధి వచ్చిందని , జనం ఆమెను తాళ్ళతో కట్టి , ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని కంప్లైంట్ చేస్తే , కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజులక్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేసారు. అయితే అందం , ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట!*
*మరోసారి మరొకరు “విజయమంటే అధికారం” అని అన్నారు.*
*”అయితే కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి!” అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు.*
*మా అనంతపురంలో ఒకప్పుడు రాష్ట్రపతి గా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి , పందులు దొర్లుతున్నాయి. విజయం అంటే అధికారం కాదు అన్న మాట.*
*చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీ లో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేసారు - “విజయం అంటే ఏమిటి?” అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు , “మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా?” అందరూ 'తెలుసు’ అన్నారు. “వాళ్ళ అవ్వ , తాతల పేర్లు తెలుసా?” అని అడిగితే అయిదారుమంది “తెలుసు” అన్నారు. “వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా?”*
*‘తెలియదు’ అన్నారు.*
*అపుడు ప్రొఫెసర్ గారు “శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , బుద్ధుడు , ఆదిశంకరుడు , అందరూ…?”*
*”ఓ , తెలుసు!” అని ముక్తకంఠం తో బదులిచ్చారు.*
*”మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తుకులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు?”అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి , ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు* *తిరుగుతుండగా ఇలా అంది : “సార్ , మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను.* *మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం , రాముడు , కృష్ణుడు , బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం ఇదే…. తమ కోసం కాకుండా సమాజ హితం కోసం తపించిన ఋషులు, మునులు చిరంజీవులైనారు.
తమ కోసం , తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది , ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే!”*
*”నా గురించి నేను దు:ఖించక పోవడమే నా ఆనందానికి కారణం!” అని 2600 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాట , “ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు , అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క '' [ Only they live who live for others , the others are more dead than alive] అని వివేకానంద 1896 లో అన్న మాట ఇదే కదా.*✍️
….సేకరణ.
. *సర్వం భగవతార్పణమస్తు*
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి