31, ఆగస్టు 2022, బుధవారం

వినాయకచవితి ని జరుపుకుంటున్నారు

 పార్ధసారధి పోట్లూరి


.


మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ?


మొదటి సారిగా బెంగుళూరు ఈద్గా మైదానంలో వినాయకచవితి ని జరుపుకుంటున్నారు ! గత 75 ఏళ్లుగా కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీలు తేల్చకుండా


వదిలేసిన సమస్య 'ఈద్గా మైదాన్ "! ఈ రాజకీయ పార్టీలకి వోట్లు పోతాయనే భయంతో ఈద్గా మైదాన్ విషయంలో కప్పదాటు ధోరణిని ప్రదర్శించి సమస్యని జటిలం చేసి వెళ్లిపోయాయి. ముస్లిం రాజకీయ నాయకులని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక సమస్యని నాన్చి మరింత జటిలం చేశాయి. ఇది మరీ ముఖ్యంగా సుదీర్ఘ కాలం కర్ణాటకని పాలిచిన కాంగ్రెస్ పార్టీ నిర్వాకం. గత ఆగస్ట్ 15 న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించి బెంగుళూరు లోని చామరాజ పేట లో ఉన్న ఈద్గా మైదానం ని దానికి వేదిక చేసుకోవాలని నిర్ణయించుకొని చామరాజ పేట లోని స్థానికులు ఈద్గా మైదానం లో చిన్న సమావేశం నిర్వహించారు. అయితే స్థానిక ఎంఎల్ఎ అయిన జహీర్ అహ్మెద్ వచ్చి ఈద్గా మైదానం తమది అని ఇక్కడ రంజాన్, బక్రీద్ ల సందర్బంగా నమాజు చేయడానికి మాత్రమే అనుమతిస్తామని ఇతర కార్యక్రమాలకి అనుమతించమని వాగ్వివాదానికి దిగాడు స్థానీకులతో ! అయితే బిజేపి నాయకులు 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ప్రభుత్వ అనుమతిని కోరారు! ప్రభుత్వం అనుమతి ఇచ్చి పోలీసు బందోబస్తు మధ్యన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిపోయింది.


తాజాగా ఆగస్ట్ 31 న వినాయ చవితి పండుగని జరుపుకోవడానికి అనుమతి ఇవ్వమని ప్రభుత్వాన్ని


 కోరారు గణేష్ ఉత్సవ నిర్వహుకులు. ఇక్కడ సమస్య మొదలయ్యింది మళ్ళీ. ఈద్గా మైదాన్ లో కేవలం ముస్లిం మత పరమయిన కార్యక్రమాలకే అనుమతి ఇస్తామని

 గణేష్ పూజకీ అనుమతి ఇవ్వమని స్థానిక ఎంఎల్ఎ జహీర్ అహ్మెద్ మళ్ళీ అభ్యంతరం పెట్టాడు. ఈద్గా మైదాన్ తమదే అని తమకి సంబంధించిన స్థలంలో మా అనుమతి లేకుండా ప్రభుత్వం అనుమతి ఎలా ఇస్తుంది అంటూ వాదనకి దిగాడు జహీర్ అహ్మెద్. 


BBMP అధికారులు ఈద్గా మైదాన్ కి యాజమాన్యమ్ కి సంబంధించి డాక్యుమెంట్లు చూపించమని అడిగారు. కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి యాజమాన్య హక్కులని నిర్ధారించే డాక్యుమెంట్స్ లేవు. అదేసమయంలో BBMP దగ్గర కూడా ఈద్గా మైదాన్ కి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని తెలిసింది మొదటిసారిగా !


కానీ కర్ణాటక రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర మాత్రం 2 ఎకరాల 10 గుంటల భూమికి సంబంధించి అది ప్రభుత్వానిదే అని నిర్ధారించే రికార్డులు ఉన్నాయి. దాంతో కర్ణాటక ప్రభుత్వం అది ప్రభుత్వ స్థలం కాబట్టి గణేష్ ఉత్సవ నిర్వహకులకి వినాయక చవితి పండుగని జరుపుకోవచ్చని అనుమతి ఇచ్చింది.


దీనిమీద ఈద్గా మైదాన్ తమదే అని వాదిస్తూ వచ్చిన జహీర్ అహ్మెద్ హై కోర్టు ని ఆశ్రయించాడు. తన పిటిషన్ లో ఈద్గా మైదానం లో గణేష్ ఉత్సవాన్ని నిర్వహించుకుండా స్టే ఆర్డర్ ఇవ్వాలని కోరాడు. ప్రభుత్వ తరపున ఈద్గా మైదాన్ నిర్వహుకుల వాదనలు విన్న కర్ణాటక హై కోర్టు గణేష్ ఉత్సవం నిర్వహించడాన్ని ఆపమని కోరిన పిటిషన్ ని కొట్టివేస్తూ చట్ట ప్రకారం ఎలాంటి అనుమతులు ఇవ్వవచ్చో వాటిని ఇవ్వమని


ప్రభుతాన్ని ఆదేశించింది! ఆగస్ట్ 31 న మొదటిసారిగా ఈద్గా మైదాన్ లో వినాయకచవితి


ఉత్సవాలు జరగబోతున్నాయి అన్నమాట ! గత దశాబ్దాలుగా ఈద్గా మైదాన యాజమాన్య హక్కులు తమవే అని వాదిస్తూ వచ్చిన వాళ్ళని కనీసం భూ యాజమాన్య హక్కులకి సంబంధించి పత్రాలు ఉన్నాయా ? లేవా ? అని అడిగిన పాపాన పోలేదు. ఏ రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వాలు కాని ! చామరాజ పేట లోని 2 ఎకరాల 10 గుంటల భూమి విలువ ఇప్పుడు హీన పక్షం 500 కోట్లు ఉంటుంది కానీ కేవలం వోట్ బాంక్ రాజకీయాలతో ఎలాంటి పత్రాలు లేని వాళ్ళకి ఇన్నాళ్ళూ అక్కడ మేకలు, గొర్రెలు అమ్ముకోవడానికి సంతని నిర్వహించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? వందల సంఖ్యలో జనావాసాల మధ్య మేకలని, గొర్రెలని పెంచుతూ వాటి దుర్గంధం ని స్థానికులు అభ్యంతరం పెడుతూ వచ్చినా ఎందుకు ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించాల్సి వచ్చింది ?


తమది కానీ భూమిలో జాతీయ జెండాని ఎగురవేయడానికి అనుమతి ఇవ్వము అని చెప్పేంత ధైర్యం వాళ్ళకి ఎవరు ఇచ్చారు ? ఇలాంటి సమస్యలు బహుశా దేశ వ్యాప్తంగా కొన్ని వేలు ఉండి ఉండవచ్చు ! జైహింద్ !

కామెంట్‌లు లేవు: