*గ్రంథం:* భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు
*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్
*ఓం గురుభక్తి ప్రదాత్రేనమః*
నెల్లూరు జిల్లా విద్యానగర్ లెక్చరర్ శ్రీ జె. గోవిందప్ప గారి అనుభవం సామాన్యులకు చాలా కాకతాళీయంగా జరిగినట్లు తోచవచ్చు, కానీ *"వెయ్యి గొఱ్ఱెలలో ఉన్నా మన గొఱ్ఱెను కాలు బట్టి లాక్కొస్తానని శ్రీస్వామివారిచ్చిన అభయం* వీరిపట్ల చక్కగా వర్తిస్తుంది.
1982 వసం॥ నుండి 1997 వసం॥ వరకు ఎప్పుడో వచ్చి వెళ్ళేరటగాని శ్రీ స్వామివారి ఎడల తీవ్రమైన భక్తిభావం కలుగలేదు. ఈ అనుభవం తర్వాత వారికి శ్రీ స్వామివారి పైగల్గిన భక్తిభావమే ఇది శ్రీ స్వామివారి అదృశ్య హస్త ప్రభావమని తెలుస్తుంది.
వారు సాయంకాలం 5 1/2 గం॥లకు తప్పక విద్యానగర్ వెళ్లవలసి ఉంది. నా (రచయిత - గొలగమూడి) దగ్గర సెలవుతీసుకొని వెళ్ళేసరికి సాయంత్రం 4 గం|| అయింది మరి 5 1/2 గం॥ లకు విద్యానగర్ వెళ్ళడమెట్ల?, 4గం॥ 10 ని. వరకు గొలగమూడిలో ఏ వాహన వసతిలేదు. ఏమిచేసినా నీదే భారం స్వామి అనుకుంటూ నిలచియున్న తనముందు ఏ.సి. కారు వచ్చి నిలబడి వస్తారా? అని అడిగారు. ఎక్కి కూర్చున్నారు.
రెండు కిలోమీటర్లు పోగానే ఎదురుగా వచ్చేలారీ కారు ప్రక్కనున్న అద్దాన్ని పగులగొట్టి పోతుంది. డ్రైవరు కారు వెనక్కు త్రిప్పి పోయి లారీని ఆపాలన్నా ఓనర్ అంగీకరించక ప్రయాణం సాగించారు. మద్యలో ఆ కారు సూళ్ళూరుపేట పోతుందని వారు విద్యానగర్ రోడ్డువరకు రావచ్చని చెప్పారు. అంతే గాక తాను ప్రతిదపా ఎవరైనా భక్తులను ఎక్కించుకుపోతానని ఈ ధపా వారిని మాత్రమే తీసుకుపోతున్నానని చెప్పాడు. 4గం||45ని॥ విద్యానగర్ చీలురోడ్డులో దిగాడు.
అక్కడకు ఒక బస్సు వచ్చి నిలుపకుండానే వెళ్ళాడు. శ్రీ స్వామినిస్మరిస్తూ నిలుచున్నాడు. టీ త్రాగుతున్నాడు. ఇంతలో లారీ వచ్చింది నలుగురు పాసింజర్లను ఎక్కించు కొని వెళ్ళి పోతుంది. టీగ్లాసు నోటి దగ్గరుంది. పదిబారల దూరం వెళ్ళి డ్రైవర్ లారీ నిలిపి -ప్రక్కకు చూచాడు. వీరు తానొస్తున్నట్లు చేత్తో సైగచేసి త్రాగి వెళ్ళి లారీ ఎక్కాడు. సరిగ్గా 5గం|| 30ని||లకే ఇల్లు చేరారు. ఈ ప్రయాణం కేవలం శ్రీ స్వామి కృపగాక మరేమీకాదంటారు గోవిందప్పగారు. ఈ సన్నివేశం ద్వారా వీరి హృదయంలో నాటిన విశ్వాసబీజమే ఇది శ్రీ స్వామి వారిలీల అనేందుకు కారణమని విశ్వసిస్తున్నారు.
🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*ఓం సమర్ధ సద్గురు శ్రీ సాయినాథాయ నమః*
*శ్రీ సాయి లీలామృతము: అధ్యాయము 28*
అలానే దాసగణు ఉస్మానాబాద్ వద్ద నివసించిన ఇస్లామ్ పూర్కర్ అనే వృద్ధ బ్రాహ్మణుడైన సాధుపుంగవుని దర్శించి, "శ్రోత్రియుడనైన నేను సాయిని దర్శించవచ్చా?" అన్నాడు. "దర్శించవచ్చు. నేను గూడ వారిని దర్శించి 3 రోజులు వారి సన్నిధిలో వున్నాను. ఆయనెంతటివారో ప్రజలు తెలుసుకోవడం లేదు. ముందు ముందు వారి గొప్పతనము ప్రజలు తెలుసుకొంటారు" అన్నారు.
*రచన: ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*
*సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*
*టాపిక్ :- 22*
*స్థిత ప్రజ్ఞుడు*
- శ్రీ రామచంద్రరావు
నాకు కొన్ని పరిస్థితులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు ఒకానొక టైమ్ ధృడంగా కల్గింది. ఆయన దగ్గర కూర్చున్నాను. ఆయన వున్నట్టుండి కళ్ళు మూసుకొని కొంచెం సేపు అలా కూర్చున్నారు. కొంత సేపైం తర్వాత నాకేసి అలా చూసేసరికి ఏదో ఒక శక్తి ఆయన కళ్ళల్లోంచి వచ్చి నాలో ప్రవేశించినట్లన్పించింది. "మనిషి చచ్చి పోవాలనుకోవటం ఏమిటి? చచ్చిపోయే బదులు జీవితాన్ని మానవసేవకు అంకితం చేస్తే పోలా! భగవచ్ఛింతనతో గడిపితే పోలా!" అని అన్నారు. ఆ తర్వాత నుంచి నా మనస్సు మారి మళ్ళీ ఆ తలంపే కల్గలేదు. ఇంకోసారి నాకు సాధనలో ఏకాగ్రత కుదరటం లేదు. నేను ఈ విషయం గురించి మాస్టర్ గారికి చెప్పనేలేదు. పాదనమస్కారం చేసుకున్నప్పుడు వెన్ను మీద నిమిరి తల మీద అలా చేయి పెట్టారు. అంతే అప్పట్నించి నాకు సాధనలో ఏకాగ్రత కుదిరింది.
🙏జై సాయిమాస్టర్🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0c2YXtx39KnzxFW4ksqktjkkCwmZ6CoUpcBhojUcX2c8LYWePiDrdXF78FTsSm526l&id=100024236412713&mibextid=Nif5oz
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి