29, నవంబర్ 2023, బుధవారం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



మంత్రిసామంతులందరూ సంతోషంగా బయలుదేరారు. సత్యవ్రతుణ్ణి చేరుకున్నారు. సాంత్వన

వాక్యాలు పలికి సగౌరవంగా అయోధ్యకు తీసుకువచ్చారు. ఎన్నో ఏళ్ళ తరువాత కొడుకును చూసిన

అరుణుడి మనస్సులో ఆనందమూ దుఃఖమూ పెల్లుబికాయి. జడలు కట్టిన జుట్టు. మాసిపోయిన

వస్త్రాలు. నీరసపడిన శరీరం. అయ్యో! కన్న బిడ్డడిని ఎంత కఠినంగా శిక్షించాను. రాజ్యార్హుణ్ణి

ఆడవులపాలు చేశానుగదా ! ధర్మం తెలిసీ దారుణంగా శిక్షించానుగదా అని లోలోపల కుమిలిపోయాడు.

ఎదురువెళ్ళి గాఢంగా కౌగిలించుకున్నాడు. బుజంమీద చేయివేసి నడిపించుకుంటూ తీసుకువచ్చి తన

ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు. జీరబోయిన గొంతుతో ప్రేమగా పలకరించాడు. రాజనీతిని ఉపదేశించాడు.

అరుణుడు చేసిన నీతిబోధ

నాయనా ! ఏనాడూ ధర్మం తప్పకు. అధర్మాన్ని ఆలోచనల్లోకి కూడా రానియ్యకు. ధర్మబద్ధమైన

రాజ్యసుఖాలను తనివితీరా అనుభవించు. ప్రజలను రక్షించు. న్యాయమార్గాలలోనే ధనం సంపాదించు.

ఎప్పుడూ అసత్యం పలకకు. అపమార్గంలో నడవకు. తపస్వులను గౌరవించు. శిష్టులు ఇచ్చిన

సలహాలను పాటించు. క్రూరులైన దస్యులను సంహరించు. ఇంద్రియాలను జయించు. రాజకార్య

నిర్వహణలో సచివులతో జరిపిన మంత్రాంగాన్ని పైకి పొక్కనివ్వకు. రహస్యంగా ఉంచు. అల్పుడుగదా

అవి ఎప్పుడూ ఏ శత్రువునూ ఉపేక్షించకు. పరాసక్తుణ్ణి విశ్వసించకు. మరీ వొంగి వొంగి దండాలు పెట్టే

చచివుణ్ణి అస్సలు నమ్మకు. కేవలం శత్రువుల పట్లనేకాదు మిత్రులపట్లకూడా చారులను నియోగించు.

న విశ్వసేత్సరాసక్తం సచివంచ తథానతమ్ |

చారాః సర్వత్ర యోక్తవ్యాః శత్రుమిత్రేషు సర్వథా

కామెంట్‌లు లేవు: