31, జనవరి 2024, బుధవారం

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

.           *🌹వేమన పద్యములు🌹* 

.             *అర్థము - తాత్పర్యము*

.                    *Part - 15*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 40*


*అంది యందనట్టి యచల స్వరూపంబు*

*పొందు పడగ బూని పొదలు వాడు*

*జెంది మిన్నకుండు జిన్మయాకారుడై* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*


అందీ అందని దాని కొరకు , ఆత్రుతపడక మానవుడు చిదానంద స్వరూపుడై ప్రవర్తించవలెను.


*💥వేమన పద్యాలు -- 41*


*అంది వేమన జెప్పిన యాత్మబుద్ధి* 

*దెలియలేనట్టి మనుజులు దేబె లరయ*

*తలను బాసిన వెండ్రుక ల్వలెను జూడ*

*భుక్తి ముక్తులు హీనమై పోవు వేమా*


*🌹తాత్పర్యము --*

వేమన చెప్పిన ఆత్మబుద్ధిని గ్రహించలేని మనుజులు వెఱ్ఱి వారగుదురు.

తలను వీడిన వెంట్రుకలు కళావిహీనమగునట్లు , భుక్తికి , ముక్తికి కూడా దూరమగుదురు.

కావున వేమన సూక్తులు ఆణిముత్యములని గమనించవలెను.


*💥వేమన పద్యాలు -- 42*


*అందు నిందు నుండు నఖిలుండు జూడగా*

*నెందు దానె నిండి యెరుగుచుండు*

*నతని పూజా ఫలము నందుటే ముక్తిరా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

 భగవంతుడు సర్వాంతర్యామి.

అన్నిట తానే ఉండి మానవుని తీరు గమనించుచూనే ఉండును.

దైవపూజ చేసి ముక్తి పొందుట కర్తవ్యము.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: