31, జనవరి 2024, బుధవారం

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

**తృతీయ స్కంధము*


*భూరి మదీయమోహతమముం బెడబాప సమర్థులన్యులె*

*వ్వారలు నీవు కాక? నిరవద్య! నిరంజన! నిర్వికార! సం*

*సారలతాలవిత్ర! బుధసత్తమ! సర్వశరణ్య! ధర్మవి*

*స్తారక! సర్వలోక శుభదాయక! నిత్యవిభూతి నాయకా!*


నాయనా! కపిలా! నన్ను చాలా ఎక్కువైన అజ్ఞానం అనే చీకటి క్రమ్ముకొని ఉన్నది. దానిని తొలగించివేయటానికి సమర్థులు నీకంటె వేరైనవారు ఎవ్వరూలేరు. ఎందుకంటే నీవు ఏ దోషాలూ లేనివాడవు. ఏ అంటుసొంటులూ లేనివాడవు. ఏ వికారాలూ నీకు లేవు. సంసారం అనే తీగలను కోసివేయగల కొడవలివంటివాడవు నీవు. సర్వమూ తెలిసినవారిలో మొదటి స్థానం నీది. అందరకూ నీవే దిక్కు. ధర్మాన్ని పెంపొందించే దైవస్వరూపుడవు నీవు. అన్ని లోకాలకూ శుభాలను ఇవ్వగలవాడవు. ఎన్నటికీ చెడిపోని మహిమలకు నాయకుడవు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

కామెంట్‌లు లేవు: