31, జనవరి 2024, బుధవారం

శ్రీ మదగ్ని మహాపురాణము

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

. *భాగం - 53*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 19*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*కుండ నిర్మాణాగ్ని కార్యవిధి - 4*


తత్ర శక్తిం న్యసేత్పశ్చాత్పార్థివీం బీజసంజ్ఞికామ్‌ | తన్మాత్రాభిః సమస్తాభిఃసంవృత్తం పార్థివం శుభమ్‌. 46


అఖణ్డం తద్భవం ధ్యాయేత్తదాధారం తదాత్మకమ్‌ |

తన్మధ్యే చిన్త యేన్మూర్తిం పౌరుషీం ప్రణావాత్మికామ్‌. 47


పిమ్మట దానియందు పృథివాకార మైనదియు, బీజ మను పేరు గలదియు అగు శక్తిని ఉంచవలెను. 


సమస్తమైన తన్మాత్రలచే ఏర్పడినది, పృథివీవికారము, శుభమైనదియు, అఖండము, దాని (శక్తి) నుండి పుట్టినది. తత్స్వరూపమును అగు దాని ఆధారమునుధ్యానించవలెను. దాని మధ్యయందు ప్రణవరూపమైన పురుషమూర్తిని ధ్యానించవలెను.


లిఙ్గం సంక్రామయేత్పశ్చాదాత్మస్థం పూర్వంసంస్కృతమ్‌ |

విభక్తేన్ద్రియ సంస్థానం క్రమాద్వృద్ధం విచిన్తయేత్‌. 48


పిమ్మట, పూర్వము సంస్కరింపబడిన, తనలో నున్న లింగశరీరమును దానిమీదికి సంక్రమింపచేయవలెను. అది క్రమముగా విభక్తమైన ఇందియములు, ఆవయవస్థితి కలదై వృద్ధిపొంది నట్లు చింతించవలెను.


తతో7ణ్డమబ్దమేకం తు స్థిత్వా విశకలీకృతమ్‌ | ద్యావాపృథవ్యౌ శకలే తయోర్మధ్యే ప్రజాపతిమ్‌. 49


జాతం ధ్యాత్వా పునః ప్రేక్ష్యప్రణవేన తు తం శిశుమ్‌ |

మన్త్రాత్మకతనుం కృత్వా యతాన్యాసం పురోదితమ్‌. 50


విష్ణుహస్తం తతో మూర్ధ్ని దత్త్వా ధ్యాత్వా తు వైష్ణవమ్‌ | ఏవమేకం బహూన్వాపి జపిత్వా ధ్యానమోగతః.


కరౌ సంగృహ్య మూలేన నేత్రే బద్ధ్వా తు వాససా | నేత్ర మన్త్రేణ మన్త్రీతాన్‌ సదశేనాహతేను తు. 52


కృతపూజో గురుః సమ్యగ్ధేవదేవస్య తత్త్వవాన్‌ | శిష్యాన్‌ పుష్పఞ్జవిభృతః ప్రాఙ్ముఖానుపవేశయేత్‌. 53


పిమ్మట అండము ఒక సంవత్సరముపాటు ఉండి బ్రద్ధలైనట్లును అ ముక్కలు ద్యులోక పృథివీలోకములైనట్లును, వాటి మధ్య ప్రజాపతి జనించి నట్లును ధ్యానించవలెను. 


మరల చూచి, ఆ శిశువును ప్రణవముచే, పూర్వము చెప్పనట్లుగా న్యాసములు చేసి మంత్రాత్మక మగు శరీరము కలవానినిగా చేయవలెను. పిమ్మట శిరస్సుపై విష్ణుహస్తము నుంచి, వైష్ణవమంత్రమును ధ్యానించవలెను. 


ఈ విధముగా ధ్యానయోగముతో ఒకటి గాని, అనేకము గాని జపించి, హస్తములను మొదళ్ళయందు పట్టుకొని, మాంత్రికుడు నేత్రమంత్రము చదువుచు అంచుతో (జాలుతో) కూడిన చినగని వస్త్రముచే ఆ శిష్యుల నేత్రములు బంధించవలెను. 


తత్త్వము నెరిగి గురువు బాగుగా దేవదేవుని పూజించి, దోసిళ్లలో పుష్పములు ధరించి యున్న ఆ శిష్యులను పూర్వాభిముఖులనుగా కూర్చుండబెట్టవలెను.


అర్చియేయుశ్చ తే7ప్యేవం ప్రసూతా గురుణా హరిమ్‌ | క్షిప్త్వా పుష్పాఞ్జలిం తత్ర పుష్పాదిభిరన న్తరమ్‌. 54


వాసుదేవార్చనం కృత్వా గురోః పాదార్చనం తతః | విధాయం దక్షిణాం దద్యాత్సర్వస్వం చార్ధమేవ వా. 55


ఆ శిష్యులు కూడ గుర్వనుజ్ఞ పొంది, అచట పుష్పాంజలిని చల్లి హరిని పూజింపవలెను. పిమ్మట పుష్పాదులతో వాసుదేవార్చనము చేసి. తరువాత గురుపాదార్చనము చేసి సర్వస్వమును గాని, దానిలో సగము గాని గురుదక్షిణగా ఇవ్వవలెను.


గురుః సంశిక్షయేచ్ఛిష్యాంసై#్తః పూజ్యో నామభిర్హరిః | విష్వక్సేనం యజేదిశం శఙ్కచక్రగదాధరమ్‌. 56


తర్జయన్తం చ తర్జన్యా మణ్డలస్థం విసర్జయేత్‌. 57


విష్ణునిర్మాల్యమఖిలం విష్వక్సేనాయ చార్పయేత్‌.


గురువు శిష్యులకు బోధించవలెను. వారు నామములతో హరిని పూజించవలెను. 


శంఖచక్రగదాధిరియై, తర్జనితో జళిపించుచున్న ప్రభు విష్వక్సేనుని పూజించి మండలమునందున్న హరికి ఉద్వాసన చెప్పవలెను. విష్ణునిర్మాల్యము నంతను విష్వక్సేనునకు సమర్పింపవలెను.


ప్రణీతాభి స్తథాత్మానమభిషిచ్య చ కుణ్డగమ్‌. 58


మహ్నిమాత్మని సంయోజ్మ విష్వక్సేనం విసర్జయేత్‌ | బుభుక్షుః సర్వమాప్నోతి ముముక్షుర్లీయతే హరౌ. 59


ఇత్యాతి మహాపురాణ ఆగ్నేయే కుణ్డనిర్మాణాద్యగ్ని కార్యాదికథనం నామ చతుర్వింశోధ్యాయః.


ప్రణీతలలో తనపైజలము చల్లుకొని, కుండములో నున్న అగ్నిని తనలో చేర్చికొని విష్వక్సేనుని విసర్జన చేయవలెను. 


ఈ విధముగ చేసినచో భోగములు అనుభవింప కోరిక గలవాడు సకలభోగములను పొందును. మోక్షేచ్ఛగల వాడు హరియందు లీను డగును.


అగ్ని మహాపురాణములో కుండనిర్మాణాగ్నికార్యాది కథన రూప మగు

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: