2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

.           *🌹వేమన పద్యములు🌹* 

.             *అర్థము - తాత్పర్యము*

.                    *Part - 17*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 46*


*అందె యింద్రజాల మయ్యె లోకంబులై*

*మించె  నొకటి కొకటి మింటి యందు*

*తన్ను దానె చూడ దలపుట మరచెను*

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము ---*

ఆ భగవంతునిలోనే లోకములన్ని నిబిడీకృతమైయున్నవి.

తన ఉనికిని మరచిపోకూడదు.

మానవుడు అస్థిత్వమును కోల్పోవుట మంచిది గాదు.


*💥వేమన పద్యాలు -- 47* 


*అంధకార మందు నణగియే యుండక*

*పరమునందు మనసు బదిల పరచి*

*గరిమ నున్న యట్టి ఘనుడెందు లేడురా*

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

అజ్ఞానమనెడి చీకటిలో ఉండరాదు.

దైవమునందు మనసు నిలిపి గొప్పగ మానవుడు ప్రవర్తించవలెను.


*💥వేమన పద్యాలు -- 48*


*అంబరంబుచూడ నేల నడవి దిరుగనేల నౌ*

*సంబళంబు లడుగ  నేల శంభు దూరనేల నా*

*నంబివాని  గోచి జించి నారిచేత గట్టు మై*

*కంబళంబు హేమమౌను కపరిసత్తు గూడినన్*


*🌹తాత్పర్యము --*

శివుని , శివభక్తులను నిందించరాదు.

శివస్మరణతో సర్వము సువర్ణముగ  భాసించును.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: