10, ఫిబ్రవరి 2024, శనివారం

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 25*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు--70*


*అగ్ని కుండయందు నమరంగ ఘటియించి*

*అవని నీరు బియ్యమందు నుంచి*

*అది పచనముగాగ హరున కర్పింపుము* 

*విశ్వదాభిరామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

అన్నమువండి శివునికి దానిని నివేదన చేయవలెను.

తరువాత శివార్పణముగా దానిని భుజించవలెను.


*💥వేమన పద్యాలు -- 71*


*అగ్ని చక్రమనగ నాకర్ణ లింగంబు*

*అగ్ని గుండమందు నంటగూర్చి*

*భవుని ధ్యాన మికను బాటింప ముక్తిరా* 

*విశ్వదాభిరామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

పంచాగ్ని మధ్యస్థుడై , నరుడు శివుని ధ్యానించవలెను.

అట్టి మానవునికి ముక్తి కలుగుట సులభమగును.


*💥వేమన పద్యాలు -- 72*


*అగ్ని చేతబట్టి యా పరమేశుని*

*నిందజేసి నటుల నీరుగారె*

*దక్ష క్రతువులోని తల్లడ మెరుగరా*

*విశ్వదాభిరామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --* 

దక్షయజ్ఞ ధ్వంసం శివుని కోపమె గదా !

శివనింద మహా పాపము.

కష్టములు కొని తెచ్చుకొన్నట్లగును.



*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: