30, జూన్ 2024, ఆదివారం

ధర్మాచరణ

 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 


🌺🌺ధర్మాచరణ🌺🌺


హిందువుల్లో చాలా మందికి హిందూధర్మం గురించి తెలియదు. వారి స్వంత గ్రంథాలు మరియు వాటి బోధనల గురించి వారికి సరైన అవగాహన లేదు. అందువలన వారికి సనాతన ధర్మం యొక్క ఔన్నత్యం తెలియదు. ఈ కారణంగానే వారికి తమ ధర్మం పట్ల పెద్దగా గౌరవం ఉండటం లేదు.


అన్యమతాలు గొప్పవి అనే అపోహకు సులభంగా లోనవుతున్నారు. ఇతర మతాలకు చెందిన వారు తమ ప్రార్థనా స్థలాల్లో క్రమం తప్పకుండా సమావేశమవుతారు. అక్కడ వారికి వారి గ్రంథాలను పరిచయం చేసి, వారి మతం మరియు అందులోని బోధనలు ఇతర మతాల కంటే గొప్పవని నమ్మేలా చేస్తారు. అక్కడ వారి మతపరిరక్షణకు వ్యాప్తికి ఏమిచెయ్యాలో కూడా సూచించబడుతుంది. సహజంగానే వారు తమ మతం కోసం నిలబడతున్నారు. వారు ఐక్యంగా ఉంటున్నారు. కానీ మనం ప్రాంతాల వారీగా, దేవుడి పరంగా, కులపరంగా విభజింపబడ్డాం. రాముడుని, శివుడుని కాకుండా కృష్ణుడిని మాత్రమే పూజించాలని ఇస్కాన్ వంటి గొప్ప సంస్థలు చెబుతున్నాయి.  కొందరు ప్రముఖ ప్రవచనకారులు అనాలోచితంగా కొన్నిసందర్భాలలో మన సంప్రదాయాలను కించపరుస్తారు. అన్యమతస్తులకు మనలను విమర్శించేందు అవకాశం కల్పిస్తారు. ఈ విధంగా మనలో ఐక్యత లేదు.


హిందువులలో ఐక్యత లోపించినపుడు మనుగడకే ముప్పువాటిల్లుతుంది. ఆనాడు ఇరాన్ ఇరాక్ ఇండోనేషియా జపాన్ మొదలైన అన్ని దేశాలలో వ్యాపించిన సనాతనధర్మం ఇప్పటికే తన ఉనికిని కోల్పోయి భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో మైనారిటీగా మిగిలిపోయింది. 

హిందువులలో ఐక్యత లోపించినపుడు అతి త్వరలోనే కాశ్మీరులో ఆనాడు జరిగిన సంఘటనలు భారతదేశమంతా జరిగే అవకాశం ఉంది. 


హిందువులు ఏకం కావడం నేడు అత్యవసరం. ఇది మన వారిలో మన ధర్మం గురించిన, సంస్కృతిని గురించిన అభిమానాన్ని, గౌరవాన్ని పెంపొందించినపుడే సాధ్యం. రాజకీయపార్టీలు అనేక కారణాల వలన నిస్సహాయంగా మిగిలిపోవచ్చు. కాబట్టి హిందువులలో ఐక్యత పెంపొందాలంటే హిందూ సంస్థలు - మతమార్పిడులు, మన దేవీదేవతలను దూషించడం వంటి మనధర్మంపై జరిగే దాడులను ప్రతిఘటించడమే కాకుండా, మన ధర్మం గురించి, మన సంస్కృతిని గురించి హిందువులకు అవగాహన కల్పించడానికి ప్రాధాన్యమివ్వాలి. వాటి ఔన్నత్యాన్ని చాటిచెప్పాలి. అప్పుడే హిందువులు నిజమైన హిందువులు అవుతారు. మతమార్పిడులకు లోనుకారు. మనసంస్కృతి కాపాడేందుకు నడుం కట్టి నిలబడతారు. ప్రజలకు సరైన పరిజ్ఞానం ఉంటే సమస్యలు సహజంగానే పరిష్కారమవుతాయి.


           జై గురుదేవ్ 👏🏼👏🏼

కామెంట్‌లు లేవు: