వీరసైనికవందనం
సీ..
దివ్యపౌరులుగుండ దేశభక్తిగనుండి
రండు రండు తెలియరండటోయి
సరిహద్దుభాగాల సతతంబు రిక్కించి
గమనించి దేశమున్ గనుసిపాయి
సాహసమతులౌచు శౌర్యప్రతాపాల
చీల్చిచెండాడగా సేనదోయి
తత్తరపడురీతి బిత్తరగనురీతి
పరసేనపై దాడి పాడిరోయి
తేగీ..
పాతికేండ్లను క్రిందట పరగె రణము
అదియె కార్గిలు యుధ్ధమై మదులనిల్చె
విజయదుందుభిమ్రోగించె వేగపోరి
జై..జవానంచు నినదించి జాతియెల్ల
ధీరసైనిక ఋణమును తీర్చుకొమ్ము..
కార్గిల్ విజయదివస్ సందర్భంగా...అక్షర నివాళులు..
రాయప్రోలు జగదీశచంద్రశర్మ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి