🎻🌹🙏శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం... (కరీంనగర్ జిల్లా )
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿తెలంగాణలో పేరెన్నికగన్న పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు కూడా ఒకటి. ఇది కరీంనగర్ జిల్లాలో ముత్యంపేట గ్రామానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జిల్లాలోని జగిత్యాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
🌸 తెలంగాణా ప్రాంతంలో
ప్రసిద్ధి చెందిన
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలలో శ్రీ కొండ గట్టు ఆంజనేయస్వామి దేవాలయం అత్యంత విశిష్ట మైనది .
ఈ ఆలయం అత్యధిక భక్త జన సందోహాన్ని ఆకర్షించి ,ప్రతి వారికి ఆ స్వామి గుండెల్లో కొలువై ఉండేట్లు చేసింది .
🌿ఈ దేవాలయము అనేక కొండలు, గుట్టలు, దట్టమైన అరణ్యములతో వెలసియున్నది.
ఈ గట్టు మీదనే శ్రీ ఆంజనేయ స్వామి వారు వెలిసినందున దీనికి 'కొండగట్టు' అను పేరు వచ్చింది.
🌸 పూర్వం రామ రావణ యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణుడు కొద్ది సేపు మూర్చపోతాడు.
ఆ సమయంలో సంజీవని తేవడానికి హనుమంతుడు వెలుతారు. సంజీవని మూలికలు దొరక్కపోవడంతో ఆ మూలికలు ఉన్న పర్వతం మొత్తాన్ని పెకిలించుకొని లంకకు తిరుగు ప్రయాణమవుతాడు.
🌿మార్గమధ్యంలో ఆ పర్వతం లోని కొంత భాగం కిందికి పడుతుంది. అలా పడిన క్షేత్రమే కొండగట్టుగా రూపాంతరం చెందిందని చెబుతారు.
సుమారు 400 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతమునకు రాగా, ఒక ఆవు తప్పిపోయింది.
🌸సంజీవుడు వెతుకుతూ ఒక పెద్ద చింతచెట్టు క్రింద నిద్రపోయాడు. స్వప్నంలో స్వామి వారు కనిపించి, “నేనిచ్చట కోరంద పొదలో ఉన్నాను. నాకు కాస్త ఎండ ముండ్ల నుండి రక్షణ కల్పించు, నీ ఆవు జాడ ఇదిగో” అంటూ చెప్పి అదృశ్యమయ్యాడు.
🌿 సంజీవుడు ఉలిక్కిపడి లేచి, ఆవును వెతకనారంభించగా, వేయి సూర్యుల కాంతి విరజిమ్మే ఆ పవిత్ర పవనసుతుడు కంటపడ్డాడు. సార్థక నాముడు సంజీవునికి మనస్సులో నిర్మల భక్తిభావం పొంగి పొరలింది. ఆనంద బాష్ప జలాలు రాలీ, స్వామివారి పాదాలను తడిపాయి. దూరం నుండి ఆవు ‘అంబా’ అంటూ పరిగెత్తుకు వచ్చింది.
🌸 సంజీవుడు గొడ్డలితో కోరంద పొదను తొలగించగా, శంఖు చక్ర గదాలంకరణతో, విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైనా నారసింహ వక్త్రముతో ఉత్తరాభిముఖంగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామి వారి రూపమును చూసి ముగ్ధుడయ్యాడు.
🌿ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు.
తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు.
అక్కడే తనకు తోచిన రీతిలో ధూప ధీప నైవేద్యాలను స్వామివారికి సమర్పించేవారు.
🌸స్వామివారి విభిన్న రూపంతో పాటు కోరిన కోర్కెలు తీరుస్తూ ఉండటం వల్ల ఈ దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.
ప్రస్తుత దేవాలయాన్ని 160 ఏళ్ల క్రితం కృష్ణారావు దేశ్‌ముఖ్ కట్టించాడు.
🌿 ఈ క్షేత్రంలో నారసింహస్వామి ముఖము (వక్త్రము) ఆంజనేయ స్వామి ముఖము, రెండు ముఖములతో వేంచేసి యుండడం
ఈ క్షేత్ర ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో ఆంజనేయస్వామివారు కనిపించడం భారత దేశంలోనేకాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదని చెబుతారు.
🌸 నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయస్వామి వారికి శంఖము, చక్రము, వక్ష స్థలములో రాముడు, సీత కలిగియుండటం ప్రత్యేక విశేషంగా ఇక్కడి గ్రామస్థులు చెబుతారు.
అందువల్లే ఈ రూపాన్ని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
🌿 దేవాలయమునకు దక్షిణ దిశలో ఒక బావి ఉన్నది . దానిలోని నీటినే స్వామి వారికి అభిషేక ,ఆరాధనా కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటారు .
ఆలయ ఆవరణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ,ఆళ్వారులు ,శ్రీ లక్ష్మి దేవి అమ్మ వారి విగ్రహాలు కూడా ఉన్నాయి .
🌸 దీర్ఘకాల రోగాలతో బాదపడుతున్న వారు ,గ్రహ దోషాలతో సతమతమవుతున్న వారు స్వామివారిని దర్శించుకుంటే తమ కోరికలు తొందరగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం .
🌿 ముఖ్యంగా సంతానం లేనివారు ఇక్కడ పూజలు చేస్తే ఫలితం ఉంటుందని చెబుతారు.
స్థానికుల కథనం ప్రకారం ఈ గుడిలో 40 రోజుల పాటు పూజలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముకం
అందువల్లే మంగళ, శనివారాల్లో ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తుంటారు.
🌸 ఈ దేవాలయం దగ్గర్లో మునుల గుహ, తిమ్మయ్యపల్లె శివారులోని బొజ్జ పోతన గుహలు ,భేతాలుడి ఆలయం, పులిగడ్డ బావి, కొండలరాయుని గట్టు ,
ఆలయానికి వెళ్లే దారి పక్కన సీతాదేవి రోధించినట్టు చెప్పే కన్నీటిగుంతలు భక్తులకు దర్శనమిస్తాయి.
ఇటువంటి దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి.
🌿కొండగట్టుపై నిద్ర చేస్తే మంచి జరుగుతుందని అని భక్తుల నమ్మకం.
నిత్యం వేలాది మంది భక్తుల దర్శిస్తుంటారు.
🌸ఏటా చైత్ర పౌర్ణమిరోజు హనుమంతుని చిన్నజయంతి, వైశాఖ బహుళదశమినాడు వచ్చే పెద్ద హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా లక్షలాది దీక్షాపరులు అంజన్నను దర్శించుకొని ముడుపులు కడతారు... స్వస్తి..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి