💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🙏 *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏
*చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్చాభాషణ క్రీడలన్*
*వదరన్ సంశయ భీకరాటవులఁ ద్రోవల్దప్పి వర్తింపఁగాఁ*
*మదనక్రోధకిరాతు లందుఁగని భీమప్రౌఢిచేఁ దాఁకినం*
*బెదరుం జిత్తము చిత్తగింపగఁదవే శ్రీకాళహస్తీశ్వరా!!!*
*శ్రీ కాళహస్తీశ్వర శతకము - 70*
*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! వేదములు చదివితిమని చెప్పుకొనుచున్న ధూర్త పండితులు కొందఱు మాటల గారడీతో మాకు భోదలు చేయబోగా వాటిని విన్న మేము... అర్ధం కాక సంశయమను అరణ్యములను పట్టి దోవతప్పి తిరగాడుతున్నాము. అటువంటి మాపై కామక్రోధములనే మృగములు దాడిచేస్తున్నాయి .... మేము ఈ విధముగా మతి తప్పి తిరుగాడుతూ ఉంటే మమ్ము ఆదుకొనక ఉపేక్ష వహించెదవేమయ్యా ప్రభో?*
✍️🌷🌺🌹🙏
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి