30, డిసెంబర్ 2024, సోమవారం

బంధాల్లో అనుబంధం

 ఫ్రెండ్స్ బంధాల్లో అనుబంధం ఆనందం ఉండాలంటే 

అహంకారం ఉండకూడదు నాకు అన్నీ తెలుసు 

నేనే గొప్ప అనే అజ్ఞానం ఉండకూడదు. 

ఒక మునీశ్వరుడు శిష్యులతో కలిసి 

నదిలో సంధ్యా  వందనం చేస్తుండగా 

ఒక తేలు నీళ్లలో   కొట్టుకువస్తుండడం గమనించాడు. 

నీళ్లలో  కొట్టుకుపోతున్న తేలుని రక్షిద్దాం అని 

దోసిట్లో తీసుకున్నాడు కాని అది అతన్ని కుట్టగానే 

 నొప్పితో వదిలేసాడు .

మళ్ళీ అది నీళ్లతో పాటు కొట్టుకు పోతుంటే 

మునీశ్వరుడు మళ్ళీ  దోసిట్లో తీసుకున్నాడు రక్షిద్దాం అని , 

కానీ మళ్ళీ  అది కుట్టింది !! నొప్పితొ వదిలేశాడు !. 

చివరికి అలా ౩ , 4  సార్లు జరిగిన తరువాత 

మొత్తానికి తేలును గట్టుమీద పడేసి 

దాని ప్రాణాన్ని రక్షించాడు !!


ఇదంతా గమనిస్తున్న ఒక శిష్యుడు 

" ఏంటి స్వామి తేలు విషపూరితం అని మీకు తెలుసు, 

కుడుతుంది అని తెలుసు ,

అయినా అది మిమ్మల్ని అన్నిసార్లు కుట్టినా  

నొప్పిని భరించి రక్షించారు  . 

అది ఎలాగూ విషపు జీవి దానిని ఎందుకు రక్షించారు ? " 

అని అడిగాడు .


అప్పుడు స్వామిజి " నాయన ! నేను తేలుని  రక్షిద్దాం అని ప్రయత్నిస్తుంటే అది తన  సహజ స్వభావమయిన

 " కుట్టడం " మరువలేదు.కేవలం తేలుకే అలా ఉంటె , 

నేను మనిషిని,మునీశ్వరుడిని , 

రక్షించే ఉపకారం చేసే స్వభావాన్ని ఎలా వదిలిపెడతను ?? 

అని అంటారు. 


 చూశారా ఫ్రెండ్స్ ఇక్కడ మనం గ్రహించి పాటించవలసిన

నీతి ఏంటి అంటే 

మనం ఎంత సహాయం చేసినా  

మనల్ని పక్కన పెట్టే వాళ్ళు , 

మనకు అపకారం చేసేవాళ్ళు మన చుట్టూ ఉండొచ్చు !! 

కాని మంచి మత్రమే చేయాలనే  

మన సహజ స్వభావం మరువకూడదు !! 

మన మంచితనం సహాయమే మనకు ఆ పరమాత్మ రక్ష !🙏


శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏

కామెంట్‌లు లేవు: