ఉ.ఆఱడి చేతలం జనుల ఆస్తుల నన్నియు నాక్రమించుచున్
గాఱులు ప్రేలి సజ్జనుల కల్మిని దోచెడు ఘాతుకమ్ములన్
వేఱిమి తోడ జేసెడు వివేకము లేని తుటారి వారికిన్
పారము పొందఁ జాలని అవాంఛితమౌ నరకమ్మెదిక్కగున్౹౹ 105
చ.సలలిత రమ్య వాగ్విభవ చారు విలోచన భక్త పాలినీ
విలసిత రాగ వల్లరి! సువీక్షిత కావ్య మనోహరోన్ముఖీ!
కలుషిత హారిణీ వివిధ కామ్య మనోరథ సిధ్ధ దాయినీ
తలచెద నీదయాంబునిధి తాప విమోచన కామ్య సిధ్ధికై౹ 106
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి