*2092*
*కం*
పెద్దలకడ తలవంచెడి
విద్దెయె నిజమైన విద్య వృధ్ధిని కోరన్
పెద్దలనెదిరించి నడువ
వద్దని బోధించువాడె బాధ్యుడు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! పెద్దలవద్ద తలవంచే విద్యయే నిజమైన విద్య. నీ అభివృద్ధి ని కోరుకునే పెద్దలను ఎదిరించ వద్దనే విద్య ను బోధించే వాడే బాధ్యుడు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి