26, డిసెంబర్ 2024, గురువారం

నిక్కము పల్క నొల్లక

 ఉ.నిక్కము పల్క నొల్లక ననేకములైన కుయుక్తులన్ సదా

టెక్కును జూపి దుర్మతిఁ దృటిన్ తమ నీచ ప్రవృత్తు లన్నియున్

నిక్కుచు నుండ అక్కసున నీల్గి మదించుచు హాని జేయ నే

యొక్కవకాశమున్ వదల నొల్లని వారి సహింప భావ్యమే౹౹ 97


శా.నీ చూడ్కుల్ సకలార్థ సాధకము లన్నింటిన్ ప్రసాదించు నీ

ప్రాచుర్యోన్నతి నంబుజాసనుఁడు విశ్వసృష్టి గావించెడున్

నాచిత్తమ్ము నొసంగి ప్రార్థనలసన్మానించెదన్ నిన్ సదా

యేచైతన్య మొసంగ నెన్నెదవొ నేయే సత్కృపన్ జూపుచున్౹౹ 98

కామెంట్‌లు లేవు: