4, జనవరి 2026, ఆదివారం

ఆచార్య సద్బోధన

 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

నేటి…


              *ఆచార్య సద్బోధన*

                 ➖➖➖✍️


*ఎవరైనా అన్యాయంగా ..*

*ఎవరి మీదైనా, చెడు ఆరోపణలు, నిందలు, వేసినంత మాత్రాన, వారి జీవితంతో చెడు అయిపోతుంది, జరుగుతుంది, అనుకోవడం పొరపాటు!* 


*నిందలు వేసిన వారిని కూడా, మనం వారిని ఏమీ చేయనవసరం లేదు ..*


*ప్రశాంతంగా ఉన్న ..*

*జీవితమనే కొలనులో ఎవరైనా, అన్యాయంగా అబద్దాలతో, నిందలనే రాయిని వేసినప్పుడు, ఆరోపణలు చేసినప్పుడు, కేవలం ఆ సమయంలో, అప్పుడు మాత్రమే, అక్కడ ఉన్న ఆ నీటి ప్రశాంతతను, ఆ రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు ..*


*కానీ, కాసేపు తరువాత, నీరు తేరుకుని నిర్మలంగా, శుభ్రంగా, స్వచ్ఛంగా, ప్రశాంతంగా కనబడుతుంది, ఉంటుంది కూడా ..*


*కానీ, నిందలు వేసినవారు, అందరి దృష్టిలో, మనస్సులో, ఆ రాయిలా, ఆ నీటి కొలనులో శాశ్వతంగా ఎప్పటికీ అడుగునే ఉండిపోతారు!*


*అందుకే, మీరు ఎవరిపైనా అనవసరంగా లేని పోని ఆరోపణలు, నిందలు వేయడానికి ఇష్టపడకండి, మంచిది కూడా కాదని గ్రహించండి ..*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

కామెంట్‌లు లేవు: