4, జనవరి 2026, ఆదివారం

మోక్ష ధర్మాలను

 భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజుకు 

(అర్జునుడికి కాదు) అనేక రాజనీతి మరియు 

మోక్ష ధర్మాలను బోధించాడు.


కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత, అంపశయ్యపై ఉన్న భీష్ముడు పాండవులకు ధర్మబోధ చేస్తుంటాడు.


అప్పుడు ద్రౌపది నవ్వి, "పితామహా! కౌరవుల సభలో నన్ను అవమానిస్తున్నప్పుడు మీ ధర్మం ఏమైంది? 

అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని ప్రశ్నిస్తుంది. 


దానికి భీష్ముడు ఇలా సమాధానం ఇస్తాడు:


*"అమ్మా! మనిషి తాను తినే ఆహారాన్ని బట్టి అతని బుద్ధి ఉంటుంది. నేను అప్పుడు దుర్మార్గుడైన దుర్యోధనుడు పెట్టిన అన్నం తిన్నాను. పాపాత్ముల ఇంట్లో భోజనం చేయడం వల్ల నా రక్తమంతా అశుద్ధమై(మలినమై) నా బుద్ధి మందగించింది. అందుకే అప్పుడు అధర్మాన్ని అడ్డుకోలేకపోయాను. ఇప్పుడు అర్జునుడి బాణాల వల్ల నా శరీరంలోని ఆ చెడురక్తం అంతా బయటకు పోయింది. అందుకే ఇప్పుడు నా బుద్ధి నిర్మలమై ధర్మం కనిపిస్తోంది."*

అని చెప్తాడు.

కామెంట్‌లు లేవు: