4, జనవరి 2026, ఆదివారం

పూజకు

  పూజకు ఏమీ వస్తువులు కావలయును మరియు ఎలా చేయాలి:


ప్రాతః కాలములోనే నిద్రలేవాలి, లేచి కాలకృత్యములు పూర్తిచేయలి. తర్వాత స్నానముచేసి (Dress Code పాటించాలి) శుభ్రమైన పొడి వస్త్రము (ధోవతి) ధరించాలి, ఉత్తరీయమును నడుముకు కట్టుకోవాలి. హృదయము పైన ఎలాంటి వస్త్రమూ (బనియను, చొక్కా లాంటివి ధరించరాదు) వుంచుకొనరాదు. వారివారి సాంప్రదాయమును అనుసరించి నుదుటిభాగమును (విభూదితో కానీ చందనముతో కానీ తిరుమణితో కానీ శ్రీ చూర్ణముతో కానీ) తిలకధారణ చేయలి. తిలకధారణ (ముఖాన బొట్టు) లేకుండా పూజమందిర ప్రవేశము నిరుపయోగము. మనము నుదుట బొట్టు ధరించడము, మన సనాతన ధర్మములపట్ల, వేదములపట్ల, పునర్జన్మ సిద్ధాంతము పట్ల, నమ్మకమునకు, గౌరవమునకు సూచన. పూజామందిరము ముందు నిలబడి మెల్లగా చప్పుడు (మూడు పర్యాయములు మెల్లగా సున్నితముగా చప్పట్లుకొట్టుచూ) చేయాలి. మనము పూజమందిరము తలుపుతీయుటకు స్వామి వారిని అనుమతిమ్మని కోరుతూ ఇలా అనుమతిని కోరుతూ చేయుక్రియ. తర్వాత మెల్లమెల్లగా పూజమందిరము తలుపును తీయలి.


పూజమందిరములోనికి వినయముతో, భయభక్తులతో, అతిజాగ్రత్తగా, వినమ్ర మనస్కులమై లోనకు ప్రవేశించాలి (ఒక అధికారి తో అతి ముఖ్యమైన ఎంతో అత్యవసరమైన పని ఉన్నప్పుడు ఎంతో గౌరవముగా తలుపువద్ద నిలబడి అతివినయము ప్రదర్శిస్తూ (“MAY I COME IN SIR,”) అని అడిగి లోనకు ప్రవేశిస్తాముకదా. మరి మన స్వామి జగత్తు కే అధికారి, ఆ అధికారి గదిలోనికి ప్రవేశించేటప్పుడు, ఎంత జాగరూకతతో ప్రవేశించాలి, ఒకసారి ఆలోచించండి.


అతి జాగ్రత్తగా స్వామివారి సింహాసనమును, పూజామందిరములోని నిర్మాల్యమును (నిన్నటి రోజున మనము స్వామివారికి సమర్పించిన ఫల పుష్పాది తీర్థప్రసాదములను, కుంకుమాది అక్షితాది పూజా వినియోగములను, దీపారాధన సామగ్రిని) అతి సున్నితముగా, భయభక్తుతలతో, తొలగించాలి. తదుపరి పూజామందిరమును శుభ్

కామెంట్‌లు లేవు: