4, జనవరి 2026, ఆదివారం

ధనాన్ని

 శ్లో॥ అర్థానామార్జనే దుఃఖం ఆర్జితానాం చ రక్షణే రక్షితానాం వ్యయే దుఃఖం ధిగర్థం దుఃఖభాజనమ్[[


తా|| ధనాన్ని సంపాదించడం శ్రమతో కష్టంతో కూడుకున్నది. అంత శ్రమించి కష్టించి సంపాదించిన ధనాన్ని రక్షించుటయూ కష్టతరమే. అట్టి ధనాన్ని ఖర్చు చేయుచున్నప్పుడు ఆ ధనానికై పడిన శ్రమ కష్టం గుర్తొచ్చి ఒకింత దుఃఖము కలుగును. ఏ విధంగా చూచిననూ ఈ ధనము ఏ దశలోనూ మానవుడికి సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఛీ..ఈ ధనమే అన్ని దుఃఖములకు మూలమగుచున్నదిగదా!

కామెంట్‌లు లేవు: