4, జనవరి 2026, ఆదివారం

దేవాలయములసేవ

  భక్త మహాశయులకు విజ్ఞప్తి శ్రీశ్రీశ్రీ ఆది శంకర భగవత్పాద పరంపరాగత మూల అమ్నాయ సర్వజ్ఞ పీఠ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర్ విజయేంద్ర సరస్వతి వారు మనందరికీ ఒక సదవకాశమును దేవాలయములసేవ చేసుకోవాలని సత్సంకల్పం కలిగిన వారికి చక్కటి శిక్షణ కార్యక్రమమును రూపొందించినారు ఈ కార్యక్రమములో ప్రధానంగా ఏ దేవాలయం అయినా పాలు పంచుకునేవారు ప్రధానంగా అర్చక స్వాములు, నిర్వాహక మండలి, ప్రసాద తయారీ విభాగము అనగా వంటవారు, సెక్యూరిటీ విభాగము, పారిశుద్ధ్య విభాగము, ఉంటాయి, అత్యంత ప్రధాన ముగా భక్తులు ఉంటారు , అలాగే ఇరుగుపొరుగు కాలనీ వాసులు, ప్రభుత్వ సంబంధమైన అంశములు, మరియు మీడియా లేదా ప్రసార సాధనములు చోటుచేసుకుని ఉంటాయి ఇలాంటి తరుణంలో దేవాలయములలో ఉద్యోగులుగా ఉన్నవారు వారి యొక్క అధిక శ్రమ బాధ్యతలలో నిమగ్నమై అన్ని విషయములయందు సమగ్రముగా దృష్టి ఉంచలేని పరిస్థితి ఏర్పడవచ్చు ఇలాంటి సమయంలో సనాతన సేవకుల అవసరము ఏర్పడుతుంది కాబట్టి వీరికి మన హిందూ సనాతన ధర్మ విషయములో తగు శిక్షణ ఏర్పాటు చేసి వారిని ఎవరైతే ఆసక్తులుగా స్వచ్ఛందంగా సమయము ఇవ్వగలిగిన వారికి మాత్రమే కావలసిన ముఖ్యంశములను బోధించి వివిధ స్థాయిలలో వారిని తీర్చిదిద్ది ఏ దేవాలయమునకు అయినా శాంతముగా సహనముతో ఓపికతో సేవ చేయగలరు ఎంపిక చేయ తలచి ఉన్నారు దీనికి ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగులు కానీ పార్ట్ టైం సమయము ఇవ్వగలిగిన వారు కానీ ఫిజికల్ గా కూడాను ఓపిక గలవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొనవచ్చును దీని కోసమని కంచి పీఠం శ్రీ కార్యం గారు అయిన శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారు, స్కందగిరి దేవాలయం చైర్మన్ గారు అయిన శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం గారు తగిన శిక్షకులను ఏర్పాట్లను చేసినారు ఆసక్తి కలవారు జనవరి 5వ తారీఖు లోపల ఈ దిగువతే తెలుపబడిన ఫోన్ నెంబర్లకు సంప్రదించ గలరు

Dr Rajasekhar Reddy 9493389618

Dr Poornachandra Murty 8106196005.

కామెంట్‌లు లేవు: