🌹 "అందరూ బాగుండాలి!" 🌹
"అందరూ బాగుండాలి!" అనేది కేవలం ఓ వాక్యం కాదు,
అది ఒక దివ్య మంత్రం !
అన్ని ఇతర మంత్రాల కంటే అదే గొప్పగ పనిచేస్తుంది!
ప్రయోగించి చూసినవారికి దాని యొక్క ఫలితాలు పూర్తిగా తెలుస్తాయి !!
'అందరూ బాగుండాలని అనుకోవల్సిన అగత్యం ఏమిటి..?'అంటూ ఎదురుప్రశ్న వేసే వారున్నారు.
'ఇతరుల బాగు కోరితే ఏం వస్తుంది..?' అన్నది వారు వేసే రెండో ప్రశ్న.
అందరూ బాగుండాలని అనుకోవడం వెనుక ఓరహస్యం ఉంది….
"సర్వేజనా స్సుఖినోభవంతు!" అనేది పెద్దల మాట!
ఇతరులు బాగుండాలని కోరుకునే వాడు…. తానూ బాగుంటాడు !!
ప్రతి రోజూ... తనకు సంబంధంలేని మనిషి యొక్క క్షేమం కోరి హృదయ పూర్వకంగా ప్రార్థన చేసే వ్యక్తికి అదే ఆరోగ్యం, ఆనందం!
ఈ ఆరోగ్యం- ఆనందం…కోసం అతడు ఎక్కడికీ వెళ్ళనక్కర లేదు.
*అలా ప్రార్థన చేస్తున్నపుడే ఇతని శరీరంలో మార్పులు కలుగుతాయి. మనసులో చక్కటి భావ ప్రకటనలు ఏర్పడి ధ్యానంగా మారి రోగాల్ని దూరం చేస్తాయి.
లోకం క్షేమం కోరుకునే వారి బాగును భగవంతుడే చూస్తుంటాడు.
నలుగురు ఇళ్ళు కట్టుకోవడానికి సహాయపడిన వ్యక్తిని చెట్టుకింద ఎవరు ఉండనిస్తారు..?
నిజాయితీగా నిస్వారంగా ఉండేవారు, నలుగురి క్షేమమూ కోరే వారే ఈ లోకానికి కావాలి. వారందరి ఉమ్మడి రూపమే దివ్యశక్తి ! దాన్ని ఏ దేవుడి పేరుతో నైనా పిలుచుకోవచ్చు!🙏🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి