*641వ నామ మంత్రము* 15.8.2020
*ఓం ధ్యానగమ్యాయై నమః*
ధ్యానముచే సాక్షాత్కారమునందగల పరమేశ్వరికి నమస్కారము.
ధ్యానమే లక్ష్యంగా గలిగిన భక్తునికి ప్రసన్నమయే తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ధ్యానగమ్యా* యను నాలుగక్షరముల (చతురాక్షరీ) నామ మంత్రమును *ఓం ధ్యానగమ్యాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని భక్తిప్రపత్తులతో ఉపాసించు భక్తులు అమ్మపై పరిపూర్ణ శరణాగతితో వర్తిస్తారు. అమ్మ కరుణచే తరిస్తారు.
జగన్మాత ధ్యానమునకు లక్ష్యమైనది. మహర్షులకు ధ్యానముచేత నిర్విషయ స్థితి యందు పొందబడునది.
*పూజకోటి సమంస్తోత్రం స్తోత్రకోటి సమో జపః*
*జపకోటి నమంధ్యానం ధ్యానకోటి సమో లయః*
కోటి పూజలకన్నా స్తోత్రం శ్రేష్ఠమైనది. కోటి స్తోత్రముల కన్నా జపము పవిత్రమైనది. కోటి జపముల కంటే ధ్యానము కోటి రెట్లు అధిక శ్రేష్ఠమైనది. ధ్యానము కన్నా లయము కోటి రెట్లు అధిక ఫలమిచ్చును. *ధ్యానం నిర్వివిషయం మనః* ధ్యానంచేత మనస్సు నిర్మలమగును. అట్టి నిర్మలమైన హృదయములో దేవి సాక్షాత్కరించును. *ధ్యానయోగేన యోగినాం* (గీత). ధ్యానమునందు నిలచిన ధ్యేయం కళ్ళు మూసినా, తెరచినా, ఒకే స్థితిలో ఉండునది *ధ్యానగమ్యా* అనబడును. ధ్యాన-ధ్యాతృ-ధ్యేయము యొక్క త్రిపుటి ఏకమగుటయే శ్రీమాత గమ్మమగును. గాన ఆ తల్లిని *ధ్యానగమ్యా* అని స్తుతించుచున్నాము.
ఆ జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ధ్యానగమ్యాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ* అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🔱నేడు శని (స్థిర) వారము🔱🔱🔱ఆ తిరుమలగిరి వాసుడైన శ్రీనివాసుని స్మరించు శుభదినము🌹🌹🌹శ్రీనివాసుని కరుణ అందరిపై ప్రసరించి అందరికీ శుభములు కలగుగాక🌻🌻🌻 ఓం నమో వేంకటేశాయ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి