14, నవంబర్ 2020, శనివారం

దీపావళి భావబీజావళి

 ." 

 

దీపావళి భావబీజావళి

 "మీ హృదయం నందన వనం 

మీ వదనం దేదీప్యమానం 

మీ దరహాసం కోటి దీప  కాంతుల 

భాసమానం కావాలని" 

ఆకాంక్ష  అందుకోండి ఈ మా శుభాకాంక్ష


--తమిళనాడు లో దీపావళినాడు ముగ్గు వేసి మధ్యలో దీపపుసేమ్మే వెలిగించి పూజ చేస్తారు.దీప లక్ష్మి కొన్ని షరతుల పైన మీ ఇంటికి వస్తుందట .

ద్వార బంధాల పై తోరణమ్ములు కట్టి స్వాగతం బనిన లాభంబు లేదు

వెండి పళ్ళేర మందు పిండి వంటలు పెట్టి ఆథిత్యమనిన సంప్రీతి లేదు.

దివ్వెల తోటలో పువ్వులు పూయించి సత్కారమనిన హర్షమ్ము లేదు.

వైభవం బీనగా బాణ సంచా కాల్చి కనుల విందు అనిన సౌఖ్యమ్ము లేదు.

ముందు మీ గుండెలందున ముసురుకున్న

కరుడు కట్టిన కటిక చీకటుల దునిమి (చంపి)

వెలుగు జెండాల నెత్తు డవ్వేళ నేను

దీప లక్ష్మిగా మీ ఇంట తేజరిల్లుదు.

ముందు మనం మన గుండెల్లో కరుడు కట్టిన దుష్ట భావాల చీకట్లను చీల్చుకో గలిగితే

దీపలక్ష్మి మన ఇళ్ళకు వస్తుంది వెలుగు నిస్తుంది,మానవ కళ్యాణ మవుతుంది.

కామెంట్‌లు లేవు: