*శ్రీ స్వామి వివేకానందులు తన శరీరాన్ని విడిచే ముందర చెప్పిన మాటలు..*
🕉🌞🌎🌙🌟🚩
*ఇక దేనికీ నేను విచారపడను. ఊహాతీతమైన ప్రశాంతతను పొందుతున్నాను. అది సుఖం కాదు, దుఃఖమూ కాదు. వాటికి అతీతమైనది.. ఇప్పుడు నేను ఆ ప్రశాంతతను సమీపిస్తున్నాను. అది శాశ్వత నీరవత (నిశ్శబ్దం). ఇప్పుడు నేను విషయాలను వాటి యథార్థ స్థితిలో, ప్రతిదాన్ని, ఆ ప్రశాంతతకి, దాని పరిపూర్ణ స్థితిలో చూడగోరుతున్నాను.*
*"ఎవడి ఆనందం వాడిలోనే ఉందో, ఎవడి కోరికలు వాడిలో మాత్రమే ఉన్నాయో, అతడు తన పాఠాలు నేర్చుకున్న వాడు.." అనేక జన్మల, స్వర్గాల, నరకాల, పరంపరలనుండి, మనం ఇక్కడ ఉండి నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఇదే - తన ఆత్మను తప్ప కోరదగింది, అడగవలసింది మరొకటి లేదు. "నేను పొందగల సర్వోత్కృష్టమైనది నా ఆత్మే.." "నేను ముక్తుణ్ణి..", కాబట్టి నేను ఆనందించడానికి మరేమి అవసరం లేదు. "అనంత కాల పర్యంతం నేను ఒక్కణ్ణే. ఎందుకంటే నేను భూతకాలంలో ముక్తుణ్ణి. ఇప్పుడు వర్తమానంలోనూ ముక్తుణ్ణి. ఇక భవిష్యత్తులోనూ ఎల్లప్పుడూ ముక్తుణ్ణిగానే ఉంటాను.." ఇది వేదాంతతత్త్వం. ఇంతకాలం సిద్దాంతాన్ని బోధించాను. కాని ఓ, ఆనందం..! నేనిప్పుడు దాన్ని నిత్యం సాక్షాత్కరించుకుంటున్నాను. అవును, నేను "ముక్తుణ్ణి.." "నేను ఏకమేవా ద్వితీయం (రెండవది లేని వాడనుగా ఉన్నాను..)"*
*మాసిపోయిన బట్టను పారవేసినట్లు నేను ఈ శరీరాన్ని త్యజించి బయటకు పోవడం మంచిదయుండవచ్చు. కాని పని చేయడం మాత్రం విరమించను. భగవంతునితో ఐక్యాన్ని లోకంలోని యావన్మంది గుర్తించే వరకు నేను వారికి ప్రేరణను కల్పిస్తూనే ఉంటాను..*
*నా ఆశయాన్ని క్లుప్తంగా ఇలా చెప్పవచ్చు:- మానవాళికి వారిలోని దివ్యత్వాన్ని బోధిస్తూ, ఆ దివ్యత్వాన్ని జీవితంలో ప్రతిక్షణం ఎలా అభివ్యక్తం చేయాలో నేర్పడం.*
*- స్వామి వివేకానంద.*
🕉🌞🌎🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి